పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 1స్వాయంభువ మనువు చరిత్ర

  •  
  •  
  •  

8-11-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు "నిరహంకృతుండును నిర్గతబుద్ధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును నైన పరమేశ్వరునకు నమస్కరించెద" నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; నిరహంకృతుండును = అహంకారములేనివాడు; నిర్గతబుద్ధుండును = వికసించిన బుద్ధుకలవాడు; నిరాశియున్ = కామములు లేనివాడు; పరిపూర్ణుండును = పరిపూర్ణమైనవాడు; అనన్యప్రేరితుండును = స్వతంత్రుడు {అనన్యప్రేరితుండు - అన్య (ఇతరులు) అన్య (కానివానిచే) ప్రేరితుండు (ప్రేరేపింపబడువాడు), స్వతంత్రుడు}; నృ = నరులకు, ఇతరులకు; శిక్షాపరుండును = బోధించువాడును; నిజ = తన యొక్క; మార్గ = ధర్మమునందు; సంస్థితుండును = బాగా స్థిరముగ నున్నవాడు; నిఖిల = సమస్తమైన; ధర్మభావనుండును = ధర్మ స్వరూపుడును; ఐన = అయిన; పరమేశ్వరున్ = భగవంతుని {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమమైన) ఈశ్వరుడు (ప్రభువు), భగవంతుడు}; కున్ = కి; నమస్కరించెదను = నమస్కరింతును; అని = అని; ఉపనిషత్ = ఉపనిషత్తులకు చెందిన; అర్థంబులున్ = పరమార్థములను; పలుకుచున్ = చెప్పుచున్న; మనువున్ = మనువును; కనుంగొని = చూసి.

భావము:

ఇంకా ఇలా ప్రార్థించాడు. “అహంకారరహితుడో, సంపూర్ణ బుద్దివికాసము గలవాడో, ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడో, ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోధిస్తుంటాడో, తన దారి వదలకుండా సకల ధర్మాలకూ కారణమై ఉంటాడో ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను.” ఈ విధంగా ఉపనిషత్తుల ధర్మాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్న స్వాయంభువ మనువును చూసి...