పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 1స్వాయంభువ మనువు చరిత్ర

  •  
  •  
  •  

8-10-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు?-
సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
గములు నిద్రింప జాగరూకత నొంది;-
యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మ కాధారంబు ఖిలంబు నెవ్వఁడౌ?-
నెవ్వని నిజధనం బింతవట్టుఁ
బొడగాన రాకుండఁ బొడఁగను? నెవ్వెడే;-
నెవ్వని దృష్టికి నెదురులేదు?

8-10.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నన వృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు నెల్ల యెడలఁ?
న మహత్త్వతత్త్వ సంజ్ఞఁ నెవ్వఁడు దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?"

టీకా:

సృష్టి = ప్రకృతి; చేన్ = చేత; ఎవ్వఁడు = ఎవడైతే; చేతనపడక = చైతన్యమునొందక, లోబడక; ఉండున్ = ఉండునో; సృష్టి = సృష్టి; ఎవ్వని = ఎవని; చేత = కృత్యము, పని; చేన్ = చేత; జనించు = సృష్టింపబడునో; జగములు = లోకములు; నిద్రింపన్ = నిద్రపోతుండగ, నశించగ; జాగరూకతన్ = మేలుకొనుటను, చైతన్యమును; ఒంది = కలిగి; ఎవ్వడు = ఎవడైతే; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; ఎఱుగుచున్ = తెలిసి; ఉండున్ = ఉండునో; ఆత్మ = ఆత్మల; కిన్ = కు; ఆధారంబున్ = ఆధారభూత; అఖిలంబు = సర్వస్వము; ఎవ్వడేని = ఎవడైతే; ఎవ్వని = ఎవని యొక్క; నిజ = స్వంత; ధనంబు = ఐశ్వర్యము; ఇంతపట్టున్ = కొంచముకూడ; పొడగాన = దర్శించ; రాకుండున్ = సాధ్యపడదో; పొడగనున్ = దర్శించుటకు; ఎవ్వడేని = ఎవనికైనను; ఎవ్వని = ఎవని యొక్క; దృష్టి = కంటిచూపున; కిన్ = కు; ఎదురు = ఎదురు; లేదు = లేదో.
జనన = సృష్టి; వృద్ధి = స్థితి; విలయ = లయమగుటలను; సంగతి = చేరుటలు; చెందక = లోనుగాకుండగ; ఎవ్వడు = ఎవడైతే; ఎడపకుండున్ = ఎడతెగక; ఎల్ల = అన్ని; యెడల = తావులందు; తన = తనయొక్క; మహత్ = మహత్తు యనెడి; తత్త్వసంజ్ఞన్ = తత్త్వముచే; ఎవ్వడు = ఎవడైతే; తాన = తనే; విశ్వరూపుడు = విశ్వమేతనరూపమైనవాడు; అనగ = అన్నవిధముగ; విస్తరిల్లు = వృద్ధిపొందునో.

భావము:

“ఎవడైతే సృష్టి వలన చైతన్యం పొందకుండా, తన చైతన్యం వలన సృష్టి చేస్తాడో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకుంటాడో, తనకు తానే ఆధారమై ఉండి సమస్తమూ తానే అయి ఉంటాడో, తన రూపం కనబడకుండా తన ప్రభావాన్ని రూపొందిస్తాడో, తన సంకల్పానికి ఎదురు లేనివాడు ఎవడో, ఆది మధ్యాంతాలు లేకుండా అన్నిచోట్లా చేరి ఉంటాడో,తన మహిమ చూపుతూ శాశ్వతుడై విశ్వరూపుడుగా వర్ధిల్లుతాడో” అంటూ స్తుతిస్తూ...