పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కూర్మావతారము

  •  
  •  
  •  

8-207-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునె
గొల్లరీతిఁ బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు
చేటు లేని మందు సిరియుఁ గనిరి.

టీకా:

గొల్లవారి = గోల్లవారి; బ్రతుకు = జీవితము; కొఱత = తక్కువది; అనన్ = అనుట; వచ్చునె = సాధ్యమా, కాదు; గొల్ల = గొల్లవారి; రీతిన్ = వలె; పాలకుప్పన్ = పాలసముద్రమును {పాలకుప్ప - పాలు+కుప్ప, సముద్రము}; త్రచ్చి = చిలికి; గొల్లలు = గొల్లవారు; ఐరి = అయ్యారు; సురలు = దేవతలు; గొల్ల = గొల్లవాడు; అయ్యెన్ = అయ్యెను; విష్ణుండు = హరి; చేటు = మరణము; లేని = లేకపోవుటను కలిగించెడి; మందు = ఔషధమును; సిరియున్ = లక్ష్మీదేవిని; కనిరి = పొందగలిగిరి.

భావము:

గొల్ల వారి వృత్తి దేనికీ తీసిపోయేది కాదు. పాలసముద్రాన్ని చిలికి, దేవతలు గొల్లవారు అయి అమరత్వాన్ని అందించే అమృతాన్ని, శ్రీమహావిష్ణువు గొల్ల అయి శ్రీమహాలక్ష్మిని పొందగలిగాడు.