పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కూర్మావతారము

  •  
  •  
  •  

8-202-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరనై లక్ష యోనముల వెడలుపై-
డుఁ గఠోరమునైన ర్పరమును
దనైన బ్రహ్మాండమైన నాహారించు-
నతరంబగు ముఖహ్వరంబు
కల చరాచర జంతురాసుల నెల్ల-
మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ-
నాఁగినఁ గదలని ట్టి కాళ్ళు

8-202.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ
మంబుజంబులఁ బోలెడు క్షి యుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె.

టీకా:

సవరన్ = చక్కనిది, చదునైనది; ఐ = అయ్యి; లక్ష = లక్ష (1,00,000); యోజనంబుల = యోజనముల; వెడలుపు = వెడల్పుగలది; ఐ = అయ్యి; కడు = మిక్కిలి; కఠోరమున్ = గట్టిది; ఐన = అయిన; కర్పరమును = తాబేటిడిప్ప; అదనైనన్ = ఆకలివేస్తే; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; ఐనన్ = అయినను; ఆహారించు = తినగలిగెడి; ఘనతరంబు = బహుపెద్దది; అగు = అయిన {ఘనము - ఘనతరము - ఘనతమము}; ముఖ = నోరు యనెడి; గహ్వరంబు = గుహ; సకల = అఖిలమైన; చరాచర = జగత్తునందలి; జంతు = జీవ; రాసులన్ = జాలమును; ఎల్లన్ = సర్వమును; మ్రింగి = మింగేసి; లోగొనున్ = ఇముడ్చుకొనగలిగిన; అట్టి = అటువంటి; మేటి = పెద్ద; కడుపు = కడుపు; విశ్వంబు = విశ్వము; పైన్ = మీద; వేఱు = మరొక; విశ్వంబు = విశ్వము; పైన్ = మీద; పడ్డన్ = పడుట; ఆగినన్ = మొదలిడినను; కదలని = చలించని; అట్టి = లాంటి; కాళ్ళు = కాళ్ళు.
వెలి = బయట; కిన్ = కు; లోని = లోపలి; కిన్ = కి; చనుదెంచు = కదలాడెడి; విపుల = పెద్ద; తుండమంబు = తొండము, తాబేలుతల; అంబుజంబులన్ = పద్మములను {అంబుజము - అంబువు (నీటియందు) జము (పుట్టునది), పద్మము}; పోలెడు = వంటి; అక్షి = కన్నుల; యుగమున్ = జంటతో; సుందరంబుగన్ = అందముగా; విష్ణుండు = హరి; సురల = దేవతల; తోడి = తోటి ఉన్న; కూర్మి = ప్రేమ; చెలువొందన్ = బయల్పడగ; ఒక = ఒక; మహా = పెద్ద; కూర్మమున్ = తాబేలుగా; అయ్యెన్ = అవతరించెను.

భావము:

విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడిచేస్తూ, మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా లక్ష యోజనాల వెడల్పుతో ఉంది. ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్ద నోరు లోకంలోని జీవరాశి అంతటిని లోపల ఇముడ్చుకోగలంతటి కడుపు. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైన కాళ్లు. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన రెండు కళ్ళు ఉన్నాయి. అలా బహు సుందర రూపంతో మహావిష్ణువు అందగిస్తున్నాడు.