పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్ర మథన యత్నము

  •  
  •  
  •  

8-194-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రియును దేవానీకము
నుగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్
రిమాయా పరవశులై
సువిమతులు కూడి పలుకఁ జొచ్చిరి కడిమిన్.

టీకా:

హరియును = విష్ణువు; దేవ = దేవతల; అనీకమున్ = సమూహము; ఉరగ = సర్పములకు; ఇంద్రునిన్ = ప్రభువుని; తలలున్ = తలవైపున; పట్టన్ = పట్టుకొనుటకు; ఉద్యోగింపన్ = యత్నిస్తుండగా; హరి = విష్ణుని; మాయా = మాయకు; పరవశులు = లొంగినవారు; ఐ = అయ్యి; సురవిమతులు = రాక్షసులు; కూడి = అందరుకలిసి; పలుకన్ = వాదులాడ; చొచ్చిరి = మొదలిడిరి; కడిమిన్ = పట్టుదలతో.

భావము:

విష్ణువు, దేవతలు వాసుకి తలవైపు పట్టుకోడానికి సిద్ధపడసాగారు. విష్ణుమాయ కమ్మిన రాక్షసులు అంతా ఒళ్ళు తెలియని పట్టుదలతో వాదులాటకు దిగారు.