పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్ర మథన యత్నము

  •  
  •  
  •  

8-192.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి యమృతజలధిఁ లశంబుఁ గావించి
త్రచ్చు నవసరమునఁ లఁపు లమర
ద్ధవస్త్రకేశభారులై యా రెండు
ములవారు తరువఁ దిసి రచట.

టీకా:

భూనాథ = రాజా; విను = వినుము; అయ్య = తండ్రి; భోగి = సర్పములకు; ఇంద్రున్ = ప్రభువుని; వాసుకిన్ = వాసుకుని; పిలిపించి = పిలిపించి; అతని = అతని; కిన్ = కి; ప్రియముజెప్పి = నచ్చచెప్పి; ఫల = ఫలితములో; భాగము = వంతు; ఈన్ = ఇచ్చుటకు; ఒడబడి = ఒప్పుకొని; సమ్మతునిజేసి = ఒప్పించి; మెల్లన = మెల్లగా; చేతులన్ = చేతులతో; మేను = దేహమును; నివిరి = దువ్వి; నీవ = నీవుమాత్రము; కాక = తప్పించి; ఎవ్వరు = ఎవరు; నేర్తురు = సమర్థులు; ఈ = ఈ; పని = కార్యమున; కున్ = కు; ఇయ్యకొమ్ము = అంగీకరింపుము; అని = అని; అతని = అతని యొక్క; కైకోలు = అంగీకారము; పడసి = పొంది; కవ్వంపు = కవ్వముగానున్న; కొండన్ = పర్వతమును; నిష్కంటకంబుగన్ = ముళ్ళులేనిదిగ; చేసి = చేసి; ఘర్షించి = రాపిడిచేసి; అతని = అతని; భోగంబున్ = శరీరమును; చుట్టి = చుట్టి.
కడగి = పూని; అమృతజలధిన్ = పాలసముద్రమును; కలశంబుగాన్ = కుండగా; కావించి = చేసుకొని; త్రచ్చు = చిలికెడి; అవసరమునన్ = సమయములో; తలపులు = బారులు; అమరన్ = తీరి; బద్ద = బిగించిన; వస్త్ర = బట్టలు; కేశభారులు = జుట్టుముడులుగలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; రెండు = రెండు (2); గముల = పక్షముల; వారున్ = వారు; తరువన్ = చిలుకుటకు; కదిసిరి = తలపడిరి; అచటన్ = అక్కట.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! దేవతలూ, రాక్షసులూ సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడారు. అమృతంలో అతనికి కూడా భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మెల్లగా శరీరాన్ని దువ్వి స్నేహం కనబరచారు. “నీ కంటే సమర్థులు ఇంకెవరూ లేరు” అని పొగుడుతూ, కవ్వపు తాడుగా ఉండటానికి ఒప్పించారు. వాసుకికి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండటానికి, మంథరపర్వతాన్ని చదును చేశారు. ఆ పెద్ద కొండను కవ్వంగా తీసుకుని, వాసుకిని తాడుగా చుట్టి, పాలసముద్రాన్ని కుండగా చేశారు. రెండు పక్షాలవారు రెండువైపులా బారులు తీరి, వస్త్రాలు ఎగగట్టు కున్నారు. జుట్టు గట్టిగా ముడులు వేసుకుని, పాల సముద్రాన్ని చిలకడానికి తలపడ్డారు.