పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మంధరగిరిని తెచ్చుట

  •  
  •  
  •  

8-187-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కులకుధర పతనజన్యం బగు దైన్యంబు సహింప నోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకల వ్యాపకుండగు హరి దత్సమీపంబున.

టీకా:

అని = అని; కులకుధర = కులపర్వతముయొక్క; పతన = పడిపోవుటచేత; జన్యంబు = జనించినది; అగు = అయిన; దైన్యంబున్ = దీనత్వమును; సహింపన్ = ఓర్చుకొన; ఓపక = లేక; పలవించుచున్న = పలవరించుచున్న; దివిజ = దేవతల; దితిజుల = రాక్షసుల; భయంబున్ = భయమును; మనంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; సకల = సర్వ; వ్యాపకుండు = వ్యాపించెడివాడు; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; తత్ = ఆ; సమీపంబునన్ = దగ్గరలో.

భావము:

దేవదానవులు ఇలా అనుకుంటూ మంథర పర్వతం పడిపోవటం వలన కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడు తున్నారు. వారి భీతిని, ఆపదను తెలుసుకున్న సర్వవ్యాపకుడు అయిన విష్ణువు ఆ ప్రదేశం దగ్గరకి వచ్చాడు.