పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మంధరగిరిని తెచ్చుట

  •  
  •  
  •  

8-183-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాసవ వర్ధకి వాఁడిగాఁ జఱచిన-
కుద్దాలముఖములఁ గొంత ద్రవ్వి
ముసలాగ్రముల జొన్పి మొదలి పాఁ తగలించి-
దీర్ఘ పాశంబులఁ ద్రిండు చుట్టి
పెకలించి బాహుల బీడించి కదలించి-
పెల్లార్చి తమతమ పేరు వాడి
పెఱికి మీఁదికి నెత్తి పృథుల హస్తంబులఁ-
లల భుజంబులఁ రలకుండ

8-183.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాని మెల్లన కుఱుతప్పుడుగు లిడుచు
భార మధికంబు మఱవక ట్టుఁ డనుచు
మందరనగంబుఁ దెచ్చి రమందగతిని.
దేవ దైత్యులు జలరాశి తెరువు పట్టి.

టీకా:

వాసవవర్ధకి = త్వష్ట {వాసవవర్ధకి - విశ్వకర్మ, దేవతాశిల్పి, త్వష్ట}; వాడిగాజఱచిన = పదునుపెట్టిన; కుద్దాల = తవ్వుగోలల; ముఖములన్ = మొనలతో; కొంతన్ = కొంచము; త్రవ్వి = తవ్వి; ముసల = రోకండ్ల; అగ్రములన్ = కొనలను; చొన్పి = దూర్చి; మొదలిపాన్ = మొదలంటా; తగిలించి = తగిలించి; దీర్ఘ = పొడవైన; పాశంబులన్ = తాళ్ళను; ద్రిండు = దిండుగా; చుట్టి = చుట్టి; పెకలించి = పెళ్ళగించి; బాహులన్ = చేతులతో; పీడించి = గట్టిగాపట్టి; కదిలించి = కదిపి; పెల్లు = గట్టిగా; అర్చి = అరచి; తమతమ = వారివారి; పేరు = పౌరుషములను; వాడి = ప్రకటించుచు; పెఱికి = పీకి; మీది = పై; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; పృథుల = పెద్దపెద్ద; హస్తంబులన్ = చేతులతో; తలలన్ = తలలకి; భుజంబులన్ = భుజములకు; తరలకుండన్ = జారకుండగ; ఆని = ఆన్చి.
మెల్లన్ = మెల్లగా; కుఱు = చిన్నచిన్నగా; తప్పుడు = అతిక్రమించెడు; అడుగులు = అడుగులు; ఇడుచున్ = వేయుచు; భారము = బరువు; అధికంబు = చాలా ఎక్కువ; మఱవక = మరచిపోకుండ; పట్టుడు = పట్టుకొనుడు; అనుచున్ = అంటూ; మందర = మందర యనెడి; నగంబున్ = పర్వతమును; తెచ్చిరి = తీసుకువచ్చిరి; అమంద = చురుకైన; గతిన్ = విధముగా; దేవ = దేవతలు; దైత్యులు = రాక్షసులు; జలరాశి = సముద్రము; తెరువుపట్టి = వైపునకు.

భావము:

దేవతాశిల్పి అయిన త్వష్ట పదునుపెట్టిన త్రవ్వు గోలలతో, దేవదానవులు మంథర పర్వతాన్ని కొంత త్రవ్వారు, రోకళ్ళను క్రిందకి చొప్పించారు. పొడుగుపాటి తాళ్ళతో బిగించి కట్టారు. చేతుల బలంకొద్దీ ఆ కొండను మెల్లగా రోకళ్ళతో కుళ్ళగించి, కదిలించి, తమ తమ బిరుదులు వాడుతూ గట్టిగా కేకలు వేస్తూ, పెరికి పెళ్లగించి పైకెత్తారు. బలమైన తమ చేతులు, తలలు, భుజాలతో జారకుండా కాసుకుంటూ కొండను ఎత్తుకున్నారు. మెల్లగా తప్పటడుగులు వేయసాగారు. అలాగే “బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి” అంటూ చురుకుగా మంథర అనే ఆ కొండను సముద్రం వైపుకు మోసుకుంటూ తీసుకొచ్చారు.

8-184-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంరము మోవ నోపమి
నంఱపైఁబడియె నదియు తిచోద్యముగాఁ;
గొంఱు నేలం గలిసిరి
కొంఱు నుగ్గయిరి; చనిరి కొందఱు భీతిన్.

టీకా:

మందరమున్ = మందరపర్వతమును; మోవన్ = మోయ; ఓపమిన్ = లేకపోవుటచేత; అందఱ = అందరి; పైన్ = మీదను; పడియెన్ = పడినది; అదియున్ = అది; అతి = మిక్కిలి; చోద్యముగాన్ = విచిత్రముగా; కొందఱున్ = కొంతమంది; నేలన్ = మట్టిలో; కలిసిరి = కలిసిపోయిరి; కొందఱున్ = కొంతమంది; నుగ్గయిరి = నలిగిపోయిరి; చనిరి = పారిపోయిరి; కొందఱున్ = కొంతమంది; భీతిన్ = భయమువలన.

భావము:

మంథరపర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి సరిపోలేదు. ఆశ్చర్యకరంగా అదిఒరిగి నేలమీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించారు, కొందరు నలిగిపోయారు, మరి కొందరు పారి పోయారు.

8-185-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఏలా హరికడ కేఁగితి?
మేలా దొరఁకొంటి మధిక హేలన శైలో
న్మూనము జేసి తెచ్చితి?
మేలా పెక్కండ్రు మడిసి రేలా నడుమన్?

టీకా:

ఏలా = ఎందుకు; హరి = విష్ణుని; కడ = దగ్గర; కున్ = కు; ఏగితిమి = వెళ్ళతిమి; ఏలా = ఎందుకు; దొరకొంటిమి = పూనుకొంటిమి; అధిక = మిక్కిలి; హేలనన్ = మైకముతో; శైల = కొండను; ఉన్మూలనము = పెకలించుట; చేసి = చేసి; తెచ్చితిమి = తీసుకొని వచ్చితిమి; ఏలా = ఎలాగా; పెక్కండ్రు = అనేకమంది; మడిసిరి = చనిపోయిరి; ఏలా = ఎలాగా; నడుమన్ = మధ్యలో.

భావము:

“విష్ణువు దగ్గరకి ఎందుకు వెళ్ళాం? మత్తెక్కినట్లు ఈ పనికి ఎందుకు పూనుకున్నాం? ఈ మంథర పర్వతాన్ని కోరి పెకలించుకుని తెచ్చాం? అందుచేత ఈ మధ్యలో పడి చనిపోయారు.

8-186-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టికి మముఁ బని బంచెను?
నేటికి మనఁ బోఁటివారి కింతలు పను? లిం
కేటికి రాఁడు రమేశ్వరుఁ?
డేటి కుపేక్షించె? మఱవ నేటికి మనలన్?"

టీకా:

ఏటి = ఎందుల; కిన్ = కు; మమున్ = మమ్ములను; పనిపంచెను = నియోగించెను; ఏటి = ఎందు; కిన్ = కు; మన = తమ; పోటి = వంటి; వారి = వారల; కిన్ = కి; ఇంతలు = ఇంతపెద్ద; పనులు = కార్యములు; ఇంకన్ = ఇంకను; ఏటి = ఎందు; కిన్ = కు; రాడు = రావడంలేదు; రమేశ్వరుడు = విష్ణువు {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవికి) ఈశ్వరుడు (పతి), విష్ణువు}; ఏటి = ఎందుల; కున్ = కు; ఉపేక్షించెన్ = నిర్లక్ష్యముచేసెను; మఱవన్ = మరచిపోవుట; ఏటి = ఎందు; కిన్ = కు; మనలన్ = మనలను.

భావము:

ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పజెప్పాడు? మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా? ఆ లక్ష్మీపతి అయిన విష్ణువు సహాయం చేయటానికి ఇంకా ఎందుచేత రావటం లేదో? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో? మనకు సాయం రాకుండా ఇలా ఎందుకు మరచిపోయాడో?”

8-187-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కులకుధర పతనజన్యం బగు దైన్యంబు సహింప నోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకల వ్యాపకుండగు హరి దత్సమీపంబున.

టీకా:

అని = అని; కులకుధర = కులపర్వతముయొక్క; పతన = పడిపోవుటచేత; జన్యంబు = జనించినది; అగు = అయిన; దైన్యంబున్ = దీనత్వమును; సహింపన్ = ఓర్చుకొన; ఓపక = లేక; పలవించుచున్న = పలవరించుచున్న; దివిజ = దేవతల; దితిజుల = రాక్షసుల; భయంబున్ = భయమును; మనంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; సకల = సర్వ; వ్యాపకుండు = వ్యాపించెడివాడు; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; తత్ = ఆ; సమీపంబునన్ = దగ్గరలో.

భావము:

దేవదానవులు ఇలా అనుకుంటూ మంథర పర్వతం పడిపోవటం వలన కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడు తున్నారు. వారి భీతిని, ఆపదను తెలుసుకున్న సర్వవ్యాపకుడు అయిన విష్ణువు ఆ ప్రదేశం దగ్గరకి వచ్చాడు.

8-188-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై
రికోటిప్రభతో "నొహో వెఱవకుం" డంచుం బ్రదీపించి త
ద్గిరిఁ గేలన్ నలువొంద గందుకము మాడ్కింబట్టి క్రీడించుచు
న్గరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్.

టీకా:

గరుడ = గరుత్మంతుని; ఆరోహకుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; గద = గద; ఆది = మున్నగునవి; ధరుడు = ధరించినవాడు; ఐ = అయ్యి; కారుణ్య = దయతో; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; హరి = సూర్యులు; కోటి = కోటిమందితోసమానమైన; ప్రభ = ప్రకాశము; తోన్ = తోటి; ఓహో = ఓహో; వెఱవకుండు = భయపడకండి; అంచున్ = అనుచు; ప్రదీపించి = అతిశయించి; తత్ = ఆ; గిరిన్ = కొండను; కేలన్ = చేతితో; నలువొందన్ = నేర్పుతో; కందుకము = బంతి; మాడ్కిన్ = వలె; పట్టి = పట్టుకొని; క్రీడించుచు = ఆడుచూ; కరుణా = కృపా; ఆలోక = దృష్టి యనెడి; సుధన్ = అమృతముతో; సుర = దేవతలు; అసురులన్ = రాక్షసుల; ప్రాణంబుల్ = ప్రాణములను; సమర్థించుచున్ = కాపాడుతూ.

భావము:

దయామయుడై, గదను ధరించి, గరుడవాహనంపై అధిరోహించి వచ్చి, విష్ణుమూర్తి కోటి సూర్యుల కాంతితో వారి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. “ఓ దేవదానవులారా! భయపడకండి” అన్నాడు. మంథర పర్వతాన్ని ఎంతో నేర్పుగా చేత్తో పట్టుకుని బంతిలా ఆడిస్తూ, దయామృతం చిలికే చూపులతో వారిని కాపాడాడు.

8-189-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలు గొలువఁగ హరియును
వారాన్నిధి కరుగు మనఁగ సుధాధరమున్
వారిజనయనునిఁ గొంచు న
వారితగతిఁ జనియె విహగల్లభుఁ డఱుతన్.

టీకా:

వారలు = వారు; కొలువంగ = సేవించుచుండగ; హరియును = విష్ణువు; వారాన్నిధి = సాగరమున; కున్ = కు; అరుగుము = వెళ్లుము; అనగన్ = చెప్పగా; వసుధాధరమున్ = పర్వతమును {వసుధాధరము - వసుధ (భూమిని) ధరము (ధరించునది), పర్వతము}; వారిజనయనునిన్ = హరిని {వారిజనయనుడు - వారిజము (పద్మముల) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; కొంచున్ = తీసుకొని; అవారిత = ఆపలేని; గతిన్ = వేగముతో; జనియెన్ = వెళ్లెను; విహగవల్లభుడు = గరుత్మంతుడు; అఱుతన్ = దగ్గరగా.

భావము:

దేవదానవులు విష్ణుమూర్తిని సేవించుకున్నారు. విష్ణుమూర్తి గరుడుని పాల సముద్రం వద్దకు తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. గరుడుడు ఆ పర్వతాన్ని, విష్ణుమూర్తిని మూపుపై ధరించి ఆటంకం లేకుండాఎగురుతూ తీసుకెళ్ళాడు.

8-190-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని జలరాశి తటంబున
జాక్షుని గిరిని డించి వందనములు స
ద్వినుతులు జేసి ఖగేంద్రుఁడు
నివినియెను భక్తి నాత్మవనంబునకున్.

టీకా:

చని = వెళ్లి; జలరాశి = సముద్రము; తటంబునన్ = గట్టుమీద; వనజాక్షుని = హరిని; గిరిని = పర్వతమును; డించి = దించి; వందనములు = నమస్కారములు; సద్వినుతులు = స్తోత్రములు; చేసి = చేసి; ఖగేంద్రుడు = గరుడుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షుల)కు ఇంద్రుడు (ప్రభువు), గరుత్మంతుడు}; పనివినియెను = సెలవుతీసుకొనెను; భక్తిన్ = భక్తితో; ఆత్మ = తన; భవనంబున్ = నివాసమున; కున్ = కు.

భావము:

అలా గరుడుడు తీసుకెళ్ళి పాలకడలి ఒడ్డున విష్ణువును, మంథరపర్వతాన్ని దించాడు, భక్తితో నమస్కరించి సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు.

8-191-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు.

టీకా:

అప్పుడు = అప్పుడు.

భావము:

అంతట.