పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణుని అనుగ్రహవచనము

  •  
  •  
  •  

8-175.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లసటేమి లేక ఖిలార్థములుఁగల్గు;
విషధిలోన నొక్క విషము పుట్టుఁ;
లఁగి వెఱవ వలదు కామరోషంబులు
స్తుచయము నందు లదు చేయ."

టీకా:

పాలమున్నీటి = పాలసముద్రము; లోపలన్ = అందు; సర్వ = అన్నిరకముల; తృణ = తృణములు {తృణములు - విత్తనమునాటక పండెడి గడ్డి చేమ తాడి కొబ్బరి మున్నగునవి}; లత = తీగలు; ఓషధములున్ = ఓషధులను {ఓషధి - పండుటతోడనే నశించునవి - వరి గోధుమ అరటి మున్నగునవి}; తెప్పించి = తెప్పించి; చాలన్ = విరివిగా; వైచి = వేసి; మందర = మందరము యనెడి; శైలంబున్ = పర్వతమును; మంథానము = కవ్వము; కాన్ = అగునట్లుగ; చేసి = చేసి; తనరన్ = అతిశయించి; వాసుకిన్ = వాసుకియనెడిసర్పమును; త్రాడు = తాడుగా; చేసి = చేసి; నా = నాయొక్క; సహాయత = సహాయము; చేతన్ = వలన; నలిన్ = తగినట్లుగ; అందఱునున్ = అందరుకలిసి; మీరు = మీరు; తరువుడు = చిలకండి; వేగము = వేగముగ; అతంద్రులు = సోమరితనము విడిచినవారు, కునుకు లేని వారు; అగుచున్ = అగుచు; ఫలము = ఫలితము; మీది = మీదే; అయ్యెడున్ = అగును; బహుళ = అనేకములైన; దుఃఖంబులన్ = కష్టములను; పడుదురు = చెందెదరు; దైత్యులు = రాక్షసులు {దైత్యులు - దితియొక్క సంతానము, రాక్షసులు}; పాపమతులు = పాపాత్ములు.
అలసట = ఆయాసము; ఏమి = ఏమాత్రము; లేక = లేకుండగ; అఖిల = సమస్తమైన; అర్థములన్ = సంపదలు; కల్గున్ = కలుగును; విషధి = సముద్రము {విషధి - విషము (నీటి)కి నిధి, సాగరము}; లోనన్ = అందు; ఒక్క = ఒక; విషము = గరళము; పుట్టున్ = జనించును; కలగి = కలతచెంది; వెఱవన్ = భయపడ; వలదు = వద్దు; కామ = ఇష్టము; రోషంబులు = కినుకలు; వస్తుచయమున్ = సంపదల; అందున్ = ఎడల; వలదు = వద్దు; చేయన్ = చేయుట.

భావము:

మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను, విరివిగా తెప్పించి వేయండి. మంథరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు వాసుకిని కవ్వం తాడుగానూ చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చిలకండి. అందువల్ల, మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలూ మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలతచెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు, ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటిపట్ల ఇష్టానిష్ఠాలు చూపరాదు.