పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-165-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ మాయ చేత విశ్వము
వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్
ధీమంతులు గుణపద విని
నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్.

టీకా:

నీ = నీ యొక్క; మాయ = మాయ; చేత = వలన; విశ్వము = భువనము; వేమాఱు = అనేకసార్లు; సృజింతువు = సృష్టించెదవు; అనుచున్ = అనుచు; విష్ణుడవు = విశ్వమును వ్యాపించి యుండు వాడవు; అనుచున్ = అనుచు; ధీమంతులు = జ్ఞానులు; గుణ = గుణములందలి; పదవిన్ = సంపదవలన; నేమంబునన్ = నియమములతో; సగుణుండు = గుణములుగలవాడు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; కాంతురు = దర్శింతురు; ఒగిన్ = క్రమముగ.

భావము:

ప్రపంచాన్ని నీ మాయచేత అనేక మార్లు సృష్టించి, త్రిగుణాలతో కూడినవాడవై ప్రపంచమంతా నిండి వుంటావు. అందుచేత గుణసంపన్నులైన వారు నిన్ను విష్ణువు అను పేర పరిగణిస్తూ, గుణవంతుడవైన నిన్ను దర్శిస్తారు.