పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొలును నీలోఁ దోఁచెను;
దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే
మొలు నడుమ దుది సృష్టికిఁ
దియఁగ ఘటమునకు మన్ను తి యగు మాడ్కిన్.

టీకా:

మొదలును = సృష్టికి ఆది; నీ = నీ; లోన్ = అందే; తోచెనున్ = కనబడెను; తుదియునున్ = అంతముకూడ; అటన్ = అక్కడనే; తోచెన్ = కనబడెను; నడుమన్ = రెంటిమధ్యదికూడ; తోచెను = కనబడెను; నీవే = నీవుమాత్రమే; మొదలు = ఆది; నడుమ = మధ్య; తుది = అంతములు; సృష్టి = సృష్టి; కిన్ = కి; కదియంగ = సరిగచూసినచో; ఘటమున్ = కుండ; కున్ = కు; మన్ను = మట్టి; గతి = కారణము; అగు = అయ్యెడి; మాడ్కిన్ = వలె.

భావము:

కుండకు మన్నే ఆధారం, కనుక కారణభూతం. దీనిని ఘటపటన్యాయం అంటారు. అలాగే, ఈ సృష్టికి మొదలూ, మధ్య, అంతమూ నీలోనే ప్రకాశితమవు తున్నాయి. ఈ సృష్టి ఆది,మధ్య, అంతములను మూడుదశలకు కారణభూతం నీవే.
విశేష వివరణ -కుండలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్నీ మట్టియొక్క రూపాలే, మట్టి అంతా ఒక్కటే. అందుచేత కుండకు ఆధారం మట్టి,పటములు అంటే వస్త్రాలు ఎన్ని రకాలైనా ఎన్నైనా అన్నీ దారాలయొక్క రూపాలే, దారాలు అన్నీ ఒక్కటే. అందుచేత పటమునకు ఆధారం దారం,ఇలా ఆధారభూతాల గురించి చెప్పే న్యాయం “ఘటపటన్యాయం”.