పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-159-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేయర్కులు గూడిగట్టి కదుపై యుద్యత్ప్రభాభూతితో
నొరూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్
విలాలోకనులై; విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్.

టీకా:

ఒకవేయు = ఒకవెయ్యి (1000); అర్కులున్ = సూర్యులు; కూడికట్టి = కలిపివేసి; కదుపు = ముద్ద; ఐ = అయ్యి; ఉద్యత్ = పెంచబడిన; ప్రభా = కాంతులనెడి; భూతి = సంపదల; తోన్ = తోటి; ఒకరూపు = ఒకటిగా పోతబోసినది; ఐ = అయ్యి; చనుదెంచు = వస్తున్న; మాడ్కిన్ = విధముగా; హరి = నారాయణుడు; తాన్ = తను; ఒప్పారెన్ = ప్రకాశించెను; ఆ = ఆ; వేలుపుల్ = దేవతలు; వికల = చెదిరిన; ఆలోకనులు = చూపులుగలవారు; ఐ = అయ్యి; విషణ్ణ = విషాదముపొందిన; మతులు = మనస్సులుగలవారు; ఐ = అయ్యి; విభ్రాంతులు = తికమకనొందినవారు; ఐ = అయ్యి; మ్రోలన్ = ఎదురుగానున్నది; కానక = చూడలేక; శంకించిరి = అనుమానపడిరి; కొంత = కొంచెము; ప్రొద్దు = సమయము; విభున్ = ప్రభువును; కానన్ = చూచుట; పోలునే = సాధ్యమా కాదు; వారి = వారి; కిన్ = కి.

భావము:

అలా ప్రత్యక్షమైన మహావిష్ణువు రూపు వెయ్యి సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరి పోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్యచకితులు అయ్యారు. వారికి ప్రభువును చూడటం సాధ్యం కాదు కదా!