పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విశ్వగర్భుని ఆవిర్భావము

  •  
  •  
  •  

8-158-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠి యందుఁ గరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగా; దేవ = దేవతల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; అనేక = వివిధ; విధంబులన్ = రకములుగా; కీర్తించుచున్ = స్తుతించుచు; ఉన్న = ఉన్నట్టి; పరమేష్ఠి = బ్రహ్మదేవుని {పరమేష్ఠి - శ్రేష్ఠమైన స్థానమగు సత్యలోకమున యుండువాడు, బ్రహ్మ}; అందున్ = ఎడల; కరుణించి = దయకలిగి; దయా = కృపజేయుటయందు; గరిష్ఠుండు = గొప్పవాడు; అగు = అయిన; విశ్వగర్భుండు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వములు తన గర్భమునగలవాడు, విష్ణువు}; ఆవిర్భవించె = ప్రత్యక్షమయ్యెను;

భావము:

దేవతా సమూహాలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేసాడు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు.