పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బ్రహ్మాదుల హరిస్తుతి

  •  
  •  
  •  

8-157-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నులగు దిదృక్షుల
కో! పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రాపింపఁ జేయు సంపద
నో! రమదయానివాస! యుజ్జ్వలతేజా!"

టీకా:

ఆపన్నులు = కష్టాలపాలైనవారలు; అగు = అయిన; దిదృక్షుల = నిన్నుదర్శించగోరువారల; కున్ = కు; ఓ = ఓ; పుణ్య = పుణ్యుడా; భవత్ = నీ యొక్క; ముఖ = ముఖము యనెడి; అబ్జము = పద్మము; ఒయ్యన = తిన్నగా; తఱి = దాటించుట; తోన్ = తోబాటు; ప్రాపింపజేయున్ = సిద్ధింపజేయును; సంపదన్ = సంపదలను; ఓ = ఓ; పరమ = బహు మిక్కిలి; దయా = కృపకు; నివాస = నిలయుడా; ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన; తేజ = తేజస్సు గలవాడ.

భావము:

పుణ్యాత్మా! దయామయా! గొప్ప తేజస్సు గలవాడా! కష్టాలపాలై నిన్ను దర్శించాలి అనుకునే వారికి నీ ముఖపద్మం సకాలంలో సమగ్రమైన సంపదను సమకూర్చుతుంది.”