పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బ్రహ్మాదుల హరిస్తుతి

  •  
  •  
  •  

8-153-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత దానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునఁ గానంబడని యవ్విభు నుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె.

టీకా:

అంతన్ = అంతట; తానును = అతను; దేవతా = దేవతల; సమూహంబునున్ = సమూహము; అతి = మిక్కిలి; రయంబునన్ = వేగముగా; చని = వెళ్ళి; వినయంబునన్ = వినమ్రతతో; కానంబడని = కనబడని; ఆ = ఆ; విభునిన్ = స్వామిని; ఉద్దేశించి = గురించి; దైవికంబులు = దివ్యములైనవి; అగు = అయిన; వచనంబులన్ = పలుకులతో; నియతేంద్రియుండు = ఏకాగ్రచిత్తముగలవాడు {నియతేంద్రియుడు - నియత (నియమింపబడిన) ఇంద్రియుడు (ఇంద్రియములుగల వాడు), ఏకాగ్రచిత్తుడు}; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అని = అనుచు; స్తుతియించెన్ = ప్రార్థించెను.

భావము:

అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్ళి ఏకాగ్రచిత్తంతో అదృశ్యరూపుడు అయిన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాడు.