పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్రమథన కథా ప్రారంభం

  •  
  •  
  •  

8-144-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పటినుండి బుధోత్తమ!
చెప్పెడు భగవత్కథా విశేషంబులు నా
కెప్పుడుఁ దనవి జనింపదు
చెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలున్.

టీకా:

అప్పటినుండి = ఇప్పటివరకు; బుధ = జ్ఞానులలో; ఉత్తమ = ఉత్తముడా; చెప్పెడు = చెప్పుతున్న; భగవత్ = భగవంతుని; కథా = వృత్తాంతముల; విశేషంబులున్ = విశేషములవలన; నా = నా; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడును; తనివి = సంతృప్తి; జనింపదు = కలుగదు; చెప్పగదే = చెప్పుము; చెవులు = వీనుల; నిండన్ = నిండుగా; శ్రీహరి = విష్ణుమూర్తి; కథలున్ = కథలను.

భావము:

ఉత్తమ పండితుడవు అయిన శుకమహర్షి! భగవంతుడి కథలు ఎన్ని చెప్పినా నాకు తృప్తి కలగదు. చెవులారా వింటాను, విష్ణు కథలు ఇంకా చెప్పు.”