పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : స్వాయంభువాది చరిత్ర

  •  
  •  
  •  

8-4-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుకాలమందు హరి యీశ్వరుఁ డేటికి సంభవించె? నే
మేమి యొనర్చె? నమ్మనువు లే? రతఁ డే క్రియఁ జేయుచున్నవాఁ?
డేమి నటించు మీఁద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము
న్నేని చెప్పుచుందురు? మునీశ్వర! నా కెఱిఁగింపవే దయన్."

టీకా:

ఏ = ఏ ఏ; మను = మనువు యొక్క; కాలము = పాలనాకాలము; అందున్ = లో; హరి = నారాయణుడు; ఈశ్వరుడు = నారాయణుడు; ఏటి = ఎందుల; కిన్ = కు; సంభవించెన్ = అవతరించెను; ఏమేమి = ఎట్టి కార్యములను; యొనర్చెన్ = చేసెను; ఆ = ఆ; మనువులు = మనువులు; ఏరి = ఎవరు; అతడు = అతడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; చేయుచున్నవాడు = చేస్తున్నాడు; ఏమి = ఏ విధముగ; నటించున్ = వర్తిస్తాడు; మీఁద = ఇకపైన; గతము = ఇంతకు పూర్వపుది; ఎయ్యది = ఏమిటి; సత్ = మంచి; జనులు = వారు; ఐన = అయిన; వారు = వారు; మున్ను = పూర్వము; ఏమని = ఏ విధముగ; చెప్పుచుందురు = చెప్పుతుంటారు; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠుడ; నా = నా; కున్ = కు; ఎఱిగింపవే = తెలుపుము; దయన్ = దయతోటి.

భావము:

ఆ మనువులు ఎవరు? భగవంతుడైన విష్ణుమూర్తి, ఆయా మనువుల కాలంలో ఎందుకు జన్మించాడు? వర్తమాన మనువుకాలంలో ఏమిచేస్తున్నాడు? గతించిన మన్వంతరాలలో ఎలాచరించాడు? భవిష్యత్తు మన్వంతరాలలో ఎలావర్తిస్తాడు? పూర్వం పెద్దలు ఏమని చెప్పారు? దయచేసి నాకు వివరంగా తెలియ చెప్పు.”