పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : స్వాయంభువాది చరిత్ర

 •  
 •  
 •  

8-3-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వినఁబడియెను స్వాయంభువ
నువంశము వర్ణ ధర్మ ర్యాదలతో
నుజుల దనుజుల వేల్పుల
నంబులు స్రష్ట లెల్ల నియించుటయున్.

టీకా:

వినబడియెను = విన్నాను; స్వాయంభువ = స్వాయంభువుడు యనెడి; మను = మనువు యొక్క; వంశమున్ = వంశముగురించి; వర్ణ = చాతుర్వర్ణముల; ధర్మ = ధర్మములు; మర్యాదల్ = కట్టుబాట్లు; తోన్ = తోపాటు; మనుజుల = మానవుల యొక్క; దనుజుల = రాక్షసుల యొక్క; వేల్పుల = దేవతల యొక్క; జననంబులున్ = పుట్టుకల గురించి; స్రష్టలు = బ్రహ్మలు; ఎల్లన్ = అందరి; జనియించుటయున్ = పుట్టుకల గురించి.

భావము:

“స్వాయంభువ మనువు వంశాన్ని గురించి, ఆ కాలంలోని జాతి ధర్మాలు, కట్టుబాట్ల గురించి. మానవులు, రాక్షసులు, దేవతలు అందరి పుట్టుకలు, బ్రహ్మలు జనించటం గురించి విన్నాను. కానీ...

8-4-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుకాలమందు హరి యీశ్వరుఁ డేటికి సంభవించె? నే
మేమి యొనర్చె? నమ్మనువు లే? రతఁ డే క్రియఁ జేయుచున్నవాఁ?
డేమి నటించు మీఁద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము
న్నేని చెప్పుచుందురు? మునీశ్వర! నా కెఱిఁగింపవే దయన్."

టీకా:

ఏ = ఏ ఏ; మను = మనువు యొక్క; కాలము = పాలనాకాలము; అందున్ = లో; హరి = నారాయణుడు; ఈశ్వరుడు = నారాయణుడు; ఏటి = ఎందుల; కిన్ = కు; సంభవించెన్ = అవతరించెను; ఏమేమి = ఎట్టి కార్యములను; యొనర్చెన్ = చేసెను; ఆ = ఆ; మనువులు = మనువులు; ఏరి = ఎవరు; అతడు = అతడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; చేయుచున్నవాడు = చేస్తున్నాడు; ఏమి = ఏ విధముగ; నటించున్ = వర్తిస్తాడు; మీఁద = ఇకపైన; గతము = ఇంతకు పూర్వపుది; ఎయ్యది = ఏమిటి; సత్ = మంచి; జనులు = వారు; ఐన = అయిన; వారు = వారు; మున్ను = పూర్వము; ఏమని = ఏ విధముగ; చెప్పుచుందురు = చెప్పుతుంటారు; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠుడ; నా = నా; కున్ = కు; ఎఱిగింపవే = తెలుపుము; దయన్ = దయతోటి.

భావము:

ఆ మనువులు ఎవరు? భగవంతుడైన విష్ణుమూర్తి, ఆయా మనువుల కాలంలో ఎందుకు జన్మించాడు? వర్తమాన మనువుకాలంలో ఏమిచేస్తున్నాడు? గతించిన మన్వంతరాలలో ఎలాచరించాడు? భవిష్యత్తు మన్వంతరాలలో ఎలావర్తిస్తాడు? పూర్వం పెద్దలు ఏమని చెప్పారు? దయచేసి నాకు వివరంగా తెలియ చెప్పు.”

8-5-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని పరీక్షిత్తు మహారాజు కోరగా, శుక ముని ఇలా చెప్పసాగాడు.

8-6-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఈ ల్పంబున మనువులు
ప్రాటముగ నార్వురైరి దునలువురలో;
లోముల జనుల పుట్టువు
లాథితము లయ్యె వరుస ఖిలములు నృపా!

టీకా:

ఈ = ప్రస్తుత; కల్పంబున = కల్పమునందు; మనువులు = మనువులు; ప్రాకటముగన్ = ప్రసిద్ధముగ; ఆర్వురు = ఆరుగురు (6); ఐరి = అయినారు; పదునలువుర = పదునాల్గుర (14) {చతుర్దశ మనువులు - 1స్వాయంభువుడు 2స్వారోచిషుడు 3ఉత్తముడు 4తామసుడు 5రైవతుడు 6చాక్షుషుడు 7వైవస్వతుడు 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13రౌచ్యుడు 14భౌచ్యుడు}; లోన్ = లోను; లోకముల = లోకముల యొక్క; జనుల = లోకుల యొక్క; పుట్టువులున్ = సృష్టిగురించి; ఆకథితములు = పూర్తిగా చెప్పబడినట్టివి; అయ్యెన్ = అయినవి; వరుసన్ = క్రమముగా; అఖిలములున్ = అన్నియును; నృపా = రాజా {నృపుడు - నృ (నరులను) పాలించువాడు}.

భావము:

“ఓ రాజా పరీక్షిత్తూ! ఈ కల్పంలో పద్నాలుగురు మనువులలోనూ ఆరుగురు మనువులు కీర్తిశేషులు అయ్యారు. లోకాలు, జనులు సృష్టి విధానాలు గురించి వరుసగా అన్నీ చెప్పాను. (ప్రస్తుతం ఏడవది అయిన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది)