పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

  •  
  •  
  •  

8-137-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజమోక్షణంబును
నిముగఁ బఠియించునట్టి నియతాత్ములకున్
రాజ వరదుఁ డిచ్చును
తురగస్యందనములుఁ గైవల్యంబున్.

టీకా:

గజరాజ = గజేంద్రుని; మోక్షణంబును = మోక్షమును; నిజముగ = సత్యముగ; పఠియించు = చదివెడి; అట్టి = అటువంటి; నియత = నియమపాలన గల; ఆత్ముల్ = వారి; కున్ = కి; గజరాజ = గజేంద్రునికి; వరదుడు = వరముల నిచ్చినవాడు; ఇచ్చును = ఇచ్చును; గజ = ఏనుగులను; తురగ = గుఱ్ఱములను; స్యందనములున్ = రథములను; కైవల్యంబున్ = మోక్షమును {కైవల్యము - కేవలము తానే హరి యగుట, మోక్షము}.

భావము:

గజేంద్ర మోక్షం కథను భక్తితో నియమంగా చదివేవారికి గజేంద్రుడిని రక్షించిన శ్రీమహావిష్ణువు ఇహలోక వైభవాలైన ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, మరియు పరలోక సౌఖ్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు.