పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీ నారాయణ సంభాషణ

  •  
  •  
  •  

8-131-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నరవిందమందిర యగు నయ్యిందిరాదేవి మందస్మితచంద్రికా సుందరవదనారవింద యగుచు ముకుందున కిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = అనిన; అరవింద = పద్మము లందు; మందిర = నివాసము గలది; అగు = అయిన; ఆ = ఆ; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; మందస్మిత = చిరునవ్వు యనెడి; చంద్రికా = వెన్నెలచే; సుందర = అందమైన; వదన = ముఖము యనెడి; అరవింద = పద్మము గలది; అగుచున్ = అగుచు; ముకుందున్ = నారాయణుని {ముకుందుడు - మోక్షమును ఇచ్ఛువాడు, విష్ణువు}; కున్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.

భావము:

శ్రీహరి మాటలు విని పద్మాలలో నివసించెడి లక్ష్మీదేవి చిరునవ్వు చిందే ముఖపద్మంతో గోవిందుడితో ఇలా అంది.