పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీ నారాయణ సంభాషణ

  •  
  •  
  •  

8-129-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“బాలా! నా వెనువెంటను
హేలన్ వినువీథినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబుఁ బట్టుట
కాలో నేమంటి నన్ను నంభోజముఖీ!

టీకా:

బాలా = చిన్నదానా; నా = నా; వెనువెంటను = కూడా; హేలన్ = విలాసముగా; వినువీథిన్ = ఆకాశమార్గమున; నుండి = నుండి; ఏతెంచుచున్ = వచ్చుచు; నీ = నీ యొక్క; చేలాంచలమున్ = పమిటకొంగును; పట్టుట = పట్టుకొనుట; కున్ = కు; ఆలోన్ = దాని విషయమై; ఏమి = ఏమి; అంటి = అనుకొంటివి; నన్నున్ = నన్ను; అంభోజముఖీ = లక్ష్మీదేవి.

భావము:

“చిన్నదానా! పద్మముఖీ! ఆకాశమార్గంలో నా వెనకాతలే విలాసంగా వస్తూ, నేను నీ పైటకొంగు విడువ కుండా పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకొన్నావో ఏమిటో?