పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని పూర్వజన్మ కథ

  •  
  •  
  •  

8-124-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిపతి నవమానించిన
నుఁ డింద్రద్యుమ్న విభుఁడుఁ గౌంజరయోనిం
నం బందెను విప్రులఁ
ని యవమానింపఁ దగదు న పుణ్యులకున్.

టీకా:

ముని = మునులలో; పతిన్ = ప్రభువుని; అవమానించిన = అవమానించి నట్టి; ఘనుడు = గొప్పవాడు; ఇంద్రద్యుమ్న = ఇంద్రద్యుమ్నుడు యనెడి; విభుడు = రాజు; కౌంజర = ఏనుగు యొక్క {కుంజరము – వ్యు. కుంజః (ప్రశస్తః) అస్తిఅస్య – కుంజ+రః, త.ప్ర., మేలైన దంతము చెక్కిలి పై భాగము కలది, ఏనుగు, ఆంధ్రశబ్దరత్నాకరము}; యోనిన్ = గర్భమున; జననంబున్ = జన్మమును; అందెను = పొందెను; విప్రులన్ = బ్రాహ్మణులను; కని = చూసి; అవమానింపన్ = అవమానించుట; తగదు = తగినపని కాదు; ఘన = గొప్ప; పుణ్యులకున్ = పుణ్యవంతుల కైనను.

భావము:

అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు.