పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని పూర్వజన్మ కథ

  •  
  •  
  •  

8-121-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ననాథ! దేవలశాప విముక్తుఁడై-
టుతర గ్రాహరూపంబు మాని
నుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు-
న తొంటి నిర్మల నువుఁ దాల్చి
రికి నవ్యయునకు తిభక్తితో మ్రొక్కి-
విలి కీర్తించి గీములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును-
వినత శిరస్కుఁడై వేడ్కతోడ

8-121.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళిత పాపుఁ డగుచు నలోకమున కేగె
పుడు శౌరి కేల నంటి తడవ
స్తి లోకనాథుఁ జ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె

టీకా:

జననాథ = రాజా {జననాథుడు - జన (మానవులకు) నాథుడు, రాజు}; దేవల = దేవలుని (ముని); శాప = శాపమునుండి; విముక్తుడు = విడివడినవాడు; ఐ = అయ్యి; పటుతర = మిక్కిలి క్రూరమైన {పటు - పటుతరము - పటుతమము}; గ్రాహ = మొసలి యొక్క; రూపంబున్ = స్వరూపమును; మాని = వదలి; ఘనుడు = గొప్పవాడు; హూహూ = హూహూ యనెడి; నామ = పేరుగల; గంధర్వుడు = గంధర్వుడు; అప్పుడు = ఆ సమయములో; తన = తన యొక్క; తొంటి = పూర్వపు; నిర్మల = నిర్మలమైన; తనువున్ = దేహమును; తాల్చి = ధరించి; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; అవ్యయున్ = విష్ణుమూర్తి {అవ్యయుడు - నాశము లేనివాడు, విష్ణువు}; కున్ = కి; అతి = మిక్కిలి; భక్తి = భక్తి; తోన్ = తోటి; మ్రొక్కి = నమస్కరించి; తవిలి = పూని; కీర్తించి = స్తోత్రముల చేసి; గీతములున్ = పాటలు; పాడి = పాడి; ఆ = ఆ; దేవున్ = భగవంతుని; కృపన్ = కరుణ; ఒంది = పొంది; అందంద = మరలమరల; మఱియునున్ = ఇంకను; వినత = మిక్కిలి వంచిన; శిరస్కుడు = తల గలవాడు; ఐ = అయ్యి; వేడ్క = వేడుక; తోడన్ = తోటి.
దళిత = పోగొట్టబడిన; పాపుడు = పాపము గలవాడు; అగుచున్ = అగుచు; తన = తన యొక్క; లోకమున్ = లోకమున; కున్ = కు; ఏగెన్ = వెళ్ళిపోయెను; అపుడు = అంతట; శౌరి = నారాయణుడు; కేలన్ = చేతితో; అంటి = ముట్టుకొని; తడవన్ = నివురుటచే; హస్తిలోకనాథుడు = గజేంద్రుడు {హస్తిలోకనాథుడు - ఏనుగుల సమూహమునకు పతి, గజేంద్రుడు}; అజ్ఞాన = అజ్ఞానము; రహితుండు = తొలగినవాడు; ఐ = అయ్యి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; రూపుడు = సారూప్యము పొందినవాడు; అగుచున్ = అగుచు; వెలుగుచుండె = ప్రకాశించుచుండెను.

భావము:

పరీక్షిన్మహారాజా! అప్పుడు దేవల ముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో “హూహూ” అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టేడు. తన పూర్వపు నిర్మలరూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరల మరల నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వుటచే, వెంటనే గజరాజు అజ్ఞాన మంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు.