పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్ర రక్షణము

  •  
  •  
  •  

8-120-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున మెల్లన నివురుచుఁ
మనురాగమున మెఱసి లయం బడుచుం
రి హరికతమున బ్రతికినఁ
పీడన మాచరించెఁ రిణుల మరలన్.

టీకా:

కరమున్ = తొండముచే; మెల్లన = మెల్లిగా; నివురుచు = సున్నితముగా రాస్తూ; కరము = అధికమైన; అనురాగమునన్ = ప్రేమతో; మెఱసి = అతిశయించి; కలయంబడుచున్ = చెర్లాడుతూ; కరి = ఏనుగు; హరి = విష్ణుమూర్తి; కతమునన్ = వలన; బ్రతికినన్ = బతికి బయటపడిన వెనుక; కర = తొండములచే; పీడనము = తాకుట; ఆచరించెన్ = చేసినది; కరిణుల = ఆడ యేనుగులను; మరలన్ = మళ్ళీ.

భావము:

శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రుడు, ఇదివరకు లానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు.