పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్ర రక్షణము

  •  
  •  
  •  

8-119-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీరి కర సంస్పర్శను
దేము దాహంబు మాని ధృతిఁ గరిణీసం
దోహంబుఁ దాను గజపతి
మోన ఘీంకార శబ్దములతో నొప్పెన్.

టీకా:

శ్రీహరి = నారాయణుడు; కర = చేతి యొక్క; సంస్పర్శను = చక్కటి స్పర్శవలన; దేహము = దేహము నందలి; దాహంబున్ = తాపము; మాని = తగ్గిపోయి; ధృతిన్ = సంతోషముతో; కరిణీ = ఆడ యేనుగులు; సందోహంబున్ = సమూహమును; తాను = అతను; గజపతి = గజేంద్రుడు; మోహన = సొంపైన; ఘీంకారముల్ = ఘీంకారముల {ఘీంకారము - ఏనుగు అరుపు}; శబ్దముల = నాదముల; తోన్ = తోటి; ఒప్పెన్ = ఒప్పియున్నది.

భావము:

విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడఏనుగుల సమూహంతో కలిసి చేస్తున్న ఘీంకార నాదాలతో సొంపుగా ఉన్నాడు.