పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్ర రక్షణము

  •  
  •  
  •  

8-113-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నిమిష = కనురెప్పపాటు కాలపు; స్పర్శంబునన్ = తగులుటలోనే; సుదర్శనంబు = సుదర్శనచక్రము; మకరి = మొసలి యొక్క; తలన్ = శిరస్సును; త్రుంచు = ఖండించెడి; అవసరంబునన్ = సమయమునందు;

భావము:

ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన చక్రం ఖండించిన ఆ సమయంలో