పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణువు ఆగమనము

  •  
  •  
  •  

8-104.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంపలను జయింపఁ క్రవాకంబులు
కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
లదవర్ణు వెనుకఁ నెడునపుడు.

టీకా:

నిటల = నుదుట; అలకులు = ముంగురులు; అంటన్ = అంటుకొనగ; నివురన్ = చక్కదిద్దబోతే; జుంజుమ్ము = జుంజుం; అని = అనెడి ఝంకారములతో; ముఖ = ముఖము యనెడి; సరోజము = పద్మము; నిండ = అంతటను; ముసురున్ = కప్పును; తేంట్లు = తుమ్మెదలు; అళులన్ = తుమ్మెదలను; జోపగన్ = తోలగా; చిల్కలు = చిలుకలు; అల్లనల్లన = మెల్లగా; చేరి = సమీపించి; ఓష్ఠ = పెదవి యనెడి; బింబ = దొండపండు; ద్యుతులు = కాంతులను; ఒడియన్ = ఒడిసిపట్టుకొన; ఉఱుకున్ = దూకును; శుకములన్ = చిలుకలను; తోలన్ = తోలగా; చక్షుః = కన్నులు యనెడి; మీనముల్ = చేపల; కున్ = కు; మందాకినీ = ఆకాశగంగలోని; పాఠీన = చేపల; లోకమున్ = సమూహము; ఎసగు = విజృంభించును; మీన = చేపల; పంక్తులన్ = సమూహములను; దాటన్ = దాటగా; మొయి = దేహము యనెడి; తీగ = తీవ; తోన్ = తోటి; రాయన్ = రాసుకుపోవుటకు; శంపా = మెఱుపు; లతలున్ = తీగలు; మింటన్ = ఆకాశములో; సరణి = వరుసలు; కట్టున్ = కట్టును.
శంపలను = మెఱుపులను; జయింపన్ = జయించుటకు; చక్రవాకంబులున్ = చక్రవాకపక్షులు; కుచ = స్తనముల; యుగంబున్ = జంటను; తాకి = ఎదుర్కొని; క్రొవ్వు = బలమును; చూపున్ = చూపుతున్నవి; మెలత = స్త్రీ; మొగిలు = మేఘము; పిఱిది = వెనుకనుండు; మెఱుగు = మెరుపు; తీవయున్ = తీగను; పోలెన్ = వలె; జలదవర్ణున్ = మేఘము వంటి రంగు వాని; వెనుకన్ = వెంట; చనెడు = వెళ్ళెడి; అపుడు = సమయము నందు.

భావము:

ఏమి వర్ణన, ఏమి వర్ణన!? అందుకే, పద్యరత్నమిది.
కరిని కాపాడాలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి–మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే, పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే, ఆమె పెదవులను చూసి దొండపండనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే, చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగ లోని పెనుచేపలు ఎగసి పడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపుతీగలను దాటగానే, చక్రవాకపక్షుల జంటలు మిడిసిపాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి.