పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-91-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను దఁట జీవుల మాటలు
ను దఁట చనరానిచోట్ల రణార్థుల కో
ను దఁట పిలిచిన సర్వముఁ
ను దఁట సందేహ మయ్యెఁ రుణావార్ధీ!

టీకా:

వినుదువు = వింటావు; అట = అట; జీవుల = ప్రాణుల; మాటలు = పిలుపులు; చనుదువు = వెళ్ళెదవు; అట = అట; చనరాని = వెళ్ళ సాధ్యముకాని; చోట్లన్ = ప్రదేశముల కైనను; శరణార్థుల్ = ఆర్థనాదము చేసెడివారి; కున్ = కి; ఓయనుదువు = మారుపలుకెదవు; అట = అట; పిలిచినన్ = పిలిచినట్టి; సర్వమున్ = సర్వులను సర్వావస్థలను; కనుదువు = చూచెదవు; అట = అట; సందేహమున్ = అనుమానము; అయ్యెన్ = కలుచున్నది; కరుణావార్ధీ = దయాసముద్రుడా.

భావము:

ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకైనా పోతావట. శరణన్న వారికి వెంటనే ‘ఓయ్’ అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.