పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-85-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పావకుండర్చుల, భానుండు దీప్తుల-
నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు
రా క్రియ నాత్మకరావళిచేత బ్ర-
హ్మాదుల, వేల్పుల, ఖిలజంతు
ణముల, జగముల, న నామ రూప భే-
ములతో మెఱయించి గ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన-
యై, గుణ సంప్రవాహంబు నెఱపు,

8-85.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
ర్మ గుణ భేద స దసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.

టీకా:

పావకుండు = అగ్ని; అర్చులన్ = జ్వాలలను; భానుండు = సూర్యుడు; దీప్తులన్ = వెలుగును; ఎబ్బంగిన్ = ఏవిధముగనైతే; నిగిడింతురు = ప్రసరింపజేసెదరో; ఎట్లు = ఏ విధముగ; అడంతురు = అణచివేయుదురో; ఆ = ఆ; క్రియన్ = విధముగనే; ఆత్మ = తన; కరావళి = కిరణముల; చేతన్ = చేత; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులన్ = మున్నగువారిని; వేల్పులన్ = దేవతలను; అఖిల = సమస్తమైన; జంతు = జీవ; గణములన్ = జాలమును; జగములన్ = భువనములను; ఘన = గొప్ప; నామ = పేర్లు; రూప = స్వరూపముల; భేదముల్ = భేదముల; తోన్ = తోటి; మెఱయించి = పుట్టించి; తగన్ = తగినట్లు; అడంచున్ = అణచివేయునో; ఎవ్వడు = ఎవడైతే; మనమున్ = మనసు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియంబులున్ = ఇంద్రియములును; తాన = తనే; ఐ = అయ్యి; గుణ = త్రిగుణములను {త్రిగుణములు - 1సత్త్వ 2రజస్సు 3తమస్సు}; సంప్రవాహంబున్ = చిక్కటి వ్యాప్తిని; నెఱపున్ = నిర్వహించునో.
స్త్రీ = స్త్రీలింగ; నపుంసక = నపుంసకలింగ; పురుష = పుల్లింగ; మూర్తియునున్ = రూపము; కాక = కాకుండగ; తిర్యక్ = జంతువుల; అమర = దేవతలను; నర = నరుల; ఆది = మొదలగువారి; మూర్తియునున్ = రూపును; కాక = కాకుండగ; కర్మ = కర్మల; గుణ = గుణముల; భేద = భేదములకు; సదసత్ = ఉండుట లేకుండును; ప్రకాశి = బయలుపరచువాడు; కాక = కాకుండగ; వెనుకన్ = ఆ పిమ్మట; అన్నియున్ = సర్వమును; తాన్ = తనే; అగు = అయ్యెడి; విబుధున్ = విజ్ఞానిని; తలంతు = ధ్యానించెదను.

భావము:

సూర్యుడు అగ్ని మంటలను, వెలుగుని ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు వంటి వాటిలో ఏ ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు, అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్నికూడ తానే అయి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.