పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-81-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వాగమామ్నాయ లధికి, నపవర్గ-
యునికి, నుత్తమ మందిరునకు,
కలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ-
నయంత రాజిల్లు న్యమతికి,
గుణలయోద్దీపిత గురు మానసునకు, సం-
ర్తితకర్మనిర్వర్తితునకు,
ది లేని నా బోఁటి శువుల పాపంబు-
డఁచువానికి, సమస్తాంతరాత్ముఁ

8-81.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డై వెలుంగువాని, చ్ఛిన్నునకు, భగ
వంతునకుఁ, దనూజ శు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.

టీకా:

సర్వ = సమస్తమైన; ఆగమ = శాస్త్రములకు; ఆమ్నాయ = వేదములకు; జలధి = సముద్రమువంటివాని; కిన్ = కి; అపవర్గ = మోక్షము యొక్క; మయుని = స్వరూపమైనవాని; కిన్ = కి; ఉత్తమ = ఉత్తమత్వమునకు, పుణ్యు లందు; మందిరున్ = నివాసమైనవాని, వసించువాని; కిన్ = కి; సకల = సర్వ; గుణా = గుణములు యనెడి; ఆరణిన్ = రాపిడికొయ్యలలో; ఛన్న = దాగి యున్న; బోధ = జ్ఞానము యనెడి; అగ్ని = అగ్ని వంటివాని; కిన్ = కి; తనయంత = తనంతతానే; రాజిల్లు = ప్రకాశించెడి; ధన్యమతి = ధన్యమైన జ్ఞానము గలవాని; కిన్ = కి; గుణ = గుణములు; లయ = లయ మగుటచేత; ఉద్ధీపిత = ప్రకాశించెడి; గురు = గొప్ప; మానసున్ = మనసు గలవాని; కున్ = కి; సంవర్తిత = పునర్జన్మలకు కారణమైన; కర్మ = కర్మను; నిర్వర్తితున్ = మరలించెడివాని; కున్ = కి; దిశ = దిక్కు; లేని = లేనట్టి; నా = నా; పోటి = వంటి; పశువుల = జంతువుల; పాపంబుల్ = పాపములను; అడచు = అణచివేయు; వాని = వాని; కిన్ = కి; సమస్త = సమస్తము నందును; అంతరాత్ముడు = లోనుండెడి ఆత్మ యైనవాడు; ఐ = అయ్యి.
వెలుంగు = ప్రకాశించెడి; వాని = వాని; కిన్ = కి; అవిచ్ఛిన్నున్ = నాశనము లేనివాని; కిన్ = కి; భగవంతున = షడ్గుణైశ్వర్యములు కలుగుటచే పూజనీయు డైనవాని {షడ్గుణములు - 1వాత్సల్యము 2భవశోషణము 3ఉదారత్వము 4అభయప్రదానము 5ఆపత్కాల సంరక్షణము 6అక్షయపదము అనెడివి విష్ణుదేవుని షడ్గుణములు (మరియొకవిధముగ) భగవంతుని షడ్గుణైశ్వర్యములు 1మహాత్మ్యము 2ధైర్యము 3యశస్సు 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము}; కున్ = కి; తనూజ = సంతానము; పశు = పశువులు; నివేశ = ఇండ్లు; దార = భార్యల యందు {దార - వ్యు. దౄ – వాదారణే , దౄ (ణిచ్) – ఆర్ – టాప్, కృ.ప్ర., అన్నదమ్ముల నుండి వేఱుపఱచునది, భార్య}; సక్తులు = వ్యామోహము గలవారు; అయిన = ఐన; వారి = వారల; కిన్ = కు; అందరాని = తెలియ సాధ్యము గాని; వానిన్ = వాని; కిన్ = కి; ఆచరింతున్ = చేసెదను; వందనములు = నమస్కారములు.

భావము:

పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రం వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయమైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని, సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మయై వెలుగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.