పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-78-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-
హ్వయమును గుణము లెవ్వనికి లేక
గములఁ గలిగించు మయించు కొఱకునై-
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ-
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ-
రమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు,

8-78.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాటలను నెఱుకల నములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.

టీకా:

భవమున్ = పుట్టుక; దోషంబున్ = పాపము; రూపంబున్ = ఆకారము; కర్మంబున్ = కర్మలు; ఆహ్వయమును = పేరు; గుణములు = గుణములు; ఎవ్వని = ఎవని; కిన్ = కైతే; లేక = లేకుండగ; జగములన్ = భువనములను; కలిగించు = సృష్టించుట; సమయించు = నశింపజేయుటల; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; నిజ = తన; మాయన్ = మాయచే; ఎవ్వడు = ఎవడైతే; ఇన్నియున్ = వీటన్నిటిని; తాల్చున్ = ధరించునో; ఆ = ఆ; పరేశున్ = అత్యున్నత ఫ్రభువు; కున్ = నకు; అనంతశక్తి = అంతులేని శక్తిమంతుని; కిన్ = కి; బ్రహ్మ = సృష్టికర్త; కిన్ = కి; ఇద్ధరూపి = సర్వాధిష్ఠానమైనవాని {ఇద్ధరూపి – ప్రసిద్ధమైన రూపములు కలవాడు. సర్వాధిష్ఠానమైనవాడు}; కిన్ = కి; రూపహీనున్ = రూప మేదీ లేనివాని; కునున్ = కు; చిత్రచారుని = విచిత్రమైన వర్తన గలవాని; కిన్ = కి; సాక్షి = సర్వమును చూచువాని; కిన్ = కి; ఆత్మరుచి = స్వయంప్రకాశుని; కినిన్ = కి; పరమాత్మున = అత్యున్నత ఆత్మ యైనవాని; కున్ = కు; పరబ్రహ్మమున్ = అతీతమైనబ్రహ్మ; కున్ = కి;
మాటలను = భాషతో; ఎఱుకలన్ = తెలివిడితో; మనములన్ = ఊహలతో; చేరంగన్ = అందుకొన; కాని = సాధ్యముకాని; శుచి = పరిశుద్ధుని; కిన్ = కి; సత్త్వ = సత్త్వగుణముతో; గమ్యుడు = దరిజేర గలవాడు; అగుచున్ = అగుచు; నిపుణుడు = నేర్పరుడు; ఐన = అయినట్టి; వాని = వాని యొక్క; నిష్కర్మత = ఫలాపేక్షలేని కర్మల; కున్ = కు; మెచ్చున్ = మెచ్చుకొను; వాని = వాని; కిన్ = కి; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; వందనములు = నమస్కారములు.

భావము:

భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింప జేయడానికి తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, సర్వసాక్షి, ఆత్మ ప్రకాశమైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు, ఊహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగిన వాడు. నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడైన ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.