పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కరి మకరుల యుద్ధము

  •  
  •  
  •  

8-69-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యక, సొలయక, వేసట
నొయక, కరి మకరితోడ నుద్దండత రా
త్రులు, సంధ్యలు, దివసంబులు
లిపెం బో రొక్క వేయి సంవత్సరముల్.

టీకా:

అలయక = అలసిపోకుండగ; సొలయక = వెనుదీయక; వేసటన్ = శ్రమమును; ఒలయక = పొందక; కరి = ఏనుగు; మకరి = మొసలి; తోడన్ = తోటి; ఉద్దండతన్ = తీవ్రముగా; రాత్రులు = రాత్రులు; సంధ్యలు = సంధ్యలు; దివసంబులు = పగళ్ళు; సలిపెన్ = సాగించెను; పోరు = పోరాటమును; ఒక్క = ఒక; వేయి = వెయ్యి (1000); సంవత్సరముల్ = ఏండ్లకాలము.

భావము:

గజరాజు రాత్రులు బవళ్ళు సంధ్యలు ఎడతెగకుండ వెయ్యి సంవత్సరాల పాటు అలసిపోకుండా సోలిపోకుండా, విసిగిపోకుండా తీవ్రంగా మొసలితో యుద్ధం సాగించాడు.