పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కరి మకరుల యుద్ధము

  •  
  •  
  •  

8-64-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విస్మిత నక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్పహృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ కలహసన్నాహ బహువిధ జలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విస్మిత = ఆశ్చర్యపడుతున్న; నక్ర = మొసళ్ళ; చక్రంబు = గుంపు గలది; అయి = ఐ; నిర్వక్ర = మొక్కపోని; విక్రమంబునన్ = పరాక్రమముతో; అల్ప = అల్పుని; హృదయ = హృదయము నందలి; జ్ఞాన = జ్ఞానము యనెడి; దీపంబున్ = దీపమును; అతిక్రమించు = కప్పివేసెడి; మహా = గొప్ప; మాయ = మాయ యనెడి; అంధకారంబునున్ = చీకటి; పోలెన్ = వలె; అంతకంతకున్ = క్రమముగా; ఉత్సాహ = ఉత్సాహము; కలహసన్నాహ = పోరాట యత్నములు; బహువిధ = వివిధ; జల = నీటిలో; అవగాహంబు = మునుకలు గలది; అయిన = ఐన; గ్రాహంబు = మొసలి; మహా = గొప్ప; సాహసంబునన్ = సాహసముతో.

భావము:

ఇలా ఆ మొసలి సాటిమొసళ్ళు ఆశ్చర్యం పోయేలా, అవక్రపరాక్రమం చూపింది. మహామాయ అనే అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లు, రకరకాలుగా నీటిలో మునిగి తేలుతూ మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహం, పోరాట పటిమ, గొప్ప సాహసాలతో గజరాజును ఆక్రమించసాగింది.