పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కరి మకరుల యుద్ధము

  •  
  •  
  •  

8-59-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించి పోవఁ గాళ్ళు రాక
గోరి చూచు చుండెఁ గుంజరీయూధంబు
గలు దగులుఁ గారె గువలకును?

టీకా:

మకరి = మొసలి; తోడన్ = తోటి; పోరు = పోరాడుచున్న; మాతంగవిభుని = గజేంద్రుని; ఒక్కరునిన్ = ఒక్కడిని; డించి = విడిచిపెట్టి; పోవన్ = వెళ్ళపోవుటకు; కాళ్ళురాక = బుద్ధిపుట్టక; కోరి = కావాలని; చూచుచుండెన్ = ఊరక చూచుచున్నవి; కుంజరీ = ఆడ యేనుగుల; యూధంబు = సమూహము; మగలు = భర్తలు; తగులు = బంధనములు; కారె = కారా ఏమి, కదా; మగువలకును = భార్యలకు.

భావము:

మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదలి వెళ్ళిపోవడానికి ఆడ ఏనుగులకు కాళ్ళాడలేదు. అవి ఊరకే చూస్తున్నాయి. ఆడవారికి భర్తలమీద బంధం విడదీయరానిది కదా!