పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కరి మకరుల యుద్ధము

  •  
  •  
  •  

8-57-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టోపంబునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం
దాటించున్, మెడఁ జుట్టిపట్టి హరి దోర్దండాభ శుండాహతిన్
నీటన్ మాటికి మాటికిం దిగువఁగా నీరాటమున్ నీటి పో
రా న్నోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై.

టీకా:

ఆటోపంబునన్ = వేగిరిపాటుతో; చిమ్మున్ = ఎగురగొట్టును; ఱొమ్ము = వక్షస్థలము; అగలన్ = పగిలిపోవునట్లు; వజ్ర = వజ్రాయుధము వంటి; అభీల = భయంకరమైన; దంతంబులన్ = దంతములతో; తాటించున్ = కొట్టును; మెడన్ = కంఠమును; చుట్టిపట్టి = చుట్టూ పట్టుకొని; హరి = ఇంద్రుని; దోర్దండ = భుజదండము; అభ = వంటి; శుండా = తొండము యొక్క; హతిన్ = దెబ్బచేత; నీటన్ = నీటిలోనికి; మాటికిమాటికిన్ = మరలమరల; తిగువగా = లాగుతుండగ; నీరాటమున్ = మొసలిని {నీరాటము – నీటి యందు చరించునది, మొసలి}; నీటి = నీటిలో చేయు; పోరాటన్ = యుద్ధములో; ఓటమిపాటు = ఓడిపోవుటను; చూపుట = చూపించుట; కున్ = కు; అరణ్యాటంబున్ = ఏనుగు {అరణ్యాటము – అరణ్యములో తిరుగునది, ఏనుగు}; వాచాటము = అరుచుచున్నది; ఐ = అయ్యి.

భావము:

గజేంద్రుడు నీటిలోకి మాటి మాటికి లాగుతున్న ఆ మొసలిని నీటి పోరాటంలో ఓడించాలని గగ్గోలు చేసాడు. దానిని వేగంగా వజ్రాయుధం లాంటి తన భయంకరమైన దంతాగ్రాలతో దాని రొమ్ము పగిలేలా చిమ్మి పొడిచాడు. ఇంద్రుని భుజంలాంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కొట్టాడు.