పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కరి మకరుల యుద్ధము

  •  
  •  
  •  

8-52-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిఁ దప్పించి కరీంద్రుఁడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొ వడఁగినట్లు జలములఁ
డి కడువడిఁ బట్టెఁ బూర్వదయుగళంబున్.

టీకా:

వడిన్ = (పట్టు యొక్క) బిగువును; తప్పించి = విడివడి; కరీంద్రుడు = గజేంద్రుడు; నిడుద = పొడవైన; కరంబున్ = తొండమును; ఎత్తి = పైకెత్తి; వ్రేయన్ = కొట్టగా; నీరాటంబున్ = జలచరము; పొడవు = శక్తి; అడగిన = నశించిన; అట్లు = విధముగా; జలములన్ = నీటిలో; పడి = పడిపోయి; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగా; పట్టెన్ = పట్టుకొనెను; పూర్వ = ముందు; పద = కాళ్ళ; యుగళంబున్ = ద్వయమును.

భావము:

గజేంద్రుడు మొసలి పట్టునుండి తప్పించుకొన్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకి మొసలి బలం పోయినట్లు నీళ్ళలో పడిపోయింది. అతి వేగంగా అది గజరాజు ముందరి కాళ్ళను పట్టుకొంది.