పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని కొలను ప్రవేశము

  •  
  •  
  •  

8-47-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి, పూరించి, చం
మార్గంబున కెత్తి, నిక్కి, వడి నుడ్డాడించి పింజింప నా
టిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
మం దాడెడు మీన కర్కటములన్ట్టెన్ సురల్ మ్రాన్పడన్.

టీకా:

ఇభలోకేంద్రుడు = గజేంద్రుడు {ఇభలోకేంద్రుడు - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు}; హస్త = తొండముల; రంధ్రములన్ = కన్నములలోనికి; నీరు = నీటిని; ఎక్కించి = పీల్చుకొని; పూరించి = నింపుకొని; చండభమార్గంబున్ = ఆకాశముపై {చండభమార్గము - సూర్యుని మార్గము, ఆకాశము, పైవైపు}; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; నిక్కి = సాచి; వడిన్ = వేగముగ; ఉడ్డాడించి = పుక్కిలించి; పింజింపన్ = చిమ్మగా; ఆరభటిన్ = పెద్ద శబ్దముతో; నీరము = నీటి; లోనన్ = లోనుండి; పెల్లు = పెల్లుమని, తీవ్రముగ; ఎగసి = ఎగిరి; నక్ర = పీతలు; గ్రాహ = మొసళ్ళు; పాఠీనముల్ = చేపలు; నభము = ఆకాశమందు; ఆడెడు = తిరిగెడు; మీన = మీనరాశి; కర్కటములన్ = కర్కాటకరాశులను; పట్టెన్ = పట్టుకొన్నవి; సురల్ = దేవతలు; మ్రాన్పడన్ = నిశ్చేష్టులుకాగా.

భావము:

గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
రహస్యార్థం -ఇలా జీవుడు మానససరస్సులోని సంకల్పాలను పరిపక్వస్థితిని కలచివేస్తుంటే, ఈశ్వరుడిలోని సూక్ష్మ వృత్తులతో ఐక్యం అయ్యాడు.