పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని వర్ణన

  •  
  •  
  •  

8-41-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి, పిపాసాపరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని.

టీకా:

మఱియున్ = ఇంకను; నానా = అనేకమైన; గహన = అడవుల యందు; విహరణ = సంచరించుటల; మహిమ = అధిక్యము; తోన్ = తోటి; మద = మదించిన; గజ = ఏనుగు; ఇంద్రము = శ్రేష్ఠము; మార్గంబున్ = దారి; తప్పి = తప్పిపోయి; పిపాసా = దప్పికకు; పరాయత్త = లోబడిన; చిత్తంబునన్ = మనసుతో; మత్త = మదించిన; కరేణువుల = ఆడ యేనుగుల; మొత్తంబునున్ = సమూహము; తానున్ = తను; చనిచని = ప్రయాణంబు సాగించి;

భావము:

ఇంకా గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పాడు. అలా ఆడ ఏనుగులు అన్నిటితోపాటు చాలా దూరం వెళ్ళాడు.
రహస్యార్థం -జీవుడు పునరపి జననం అనుకుంటూ అనేక జన్మలు పొందడానికి సిద్ధపడి, నివృత్తి మార్గం నుండి తప్పిపోయి, ప్రవృత్తి మార్గంలో ప్రవేశించాడు.