పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని వర్ణన

  •  
  •  
  •  

8-40-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న కుంభముల పూర్ణకు డిగ్గి యువతుల-
కుచములు పయ్యెదకొంగు లీఁగఁ;
న యానగంభీరకుఁ జాల కబలల-
యానంబు లందెల నండగొనఁగఁ;
న కరశ్రీఁ గని లఁకి బాలల చిఱు-
దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ;
న దంతరుచి కోడి రుణుల నగవులు-
ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ;

8-40.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదు లావణ్యరూపంబుఁలఁచిచూఁడ
నంజనాభ్రము కపిలాది రిదిభేంద్ర
యిత లందఱుఁ దనవెంటఁ గిలినడవఁ;
గుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప బోలె.
^అష్టదిగ్గజములు - భార్యలు

టీకా:

తన = తన; కుంభముల = కుంభముల యొక్క; పూర్ణత = నిండుదనమున; కున్ = కు; డిగ్గి = ఓడిపోయి; యువతుల = స్త్రీల; కుచములు = వక్షోజములు; పయ్యెద = పమిట; కొంగులు = కొంగులందు; ఈగన్ = చొరబడగ; తన = తన; యాన = నడకల; గంభీరత = గంభీరత; కున్ = కు; చాలక = సాటిరాలేక; అబలల = స్త్రీల; యానంబుల్ = నడకలు; అందెలన్ = కాలి యందెలను; అండకొనగ = సహాయము పొందగ; తన = తన; కర = తొండము యొక్క; శ్రీన్ = సౌందర్యమును; కని = చూసి; తలకి = చలించిపోయి; బాలల = పిల్లల; చిఱు = చిన్ని; తొడలు = తొడలు; మేఖల = బంగారు మొలతాళ్ళ; దీప్తిన్ = కాంతులను; తోడు = సహాయమును; పిలువన్ = అర్థించగ; తన = తన; దంత = దంతముల; రుచికిన్ = కాంతులకు; ఓడి = సాటిరాలేక; తరుణుల = స్త్రీల; నగవులు = నవ్వులు; ముఖ = మొహము యనెడి; చంద్ర = చంద్రుని; దీప్తులన్ = కాంతులను; ముసుగుదిగువన్ = ముసుగువేసికొనగ; తనదు = తన యొక్క.
లావణ్య = సుందరమైన; రూపంబున్ = రూపమును; తలచి = భావించికొని; చూడన్ = చూచుటకు; అంజన = ఈశాన్య దిగ్గజము భార్య అంజనావతి {అంజనావతి ఆది - దిగ్గజముల భార్యలు, 1తూర్పు అభ్రము 2ఆగ్నేయము కపిల 3దక్షిణము పింగళ 4నైఋతి అనుపమ 5పడమర తామ్రపర్ణి 6వాయవ్యము శుభ్రదంతి 7ఉత్తరము అంగన 8ఈశాన్యము అంజనావతి}; అభ్రము = తూర్పు దిగ్గజము భార్య; కపిల = ఆగ్నేయ దిగ్గజము భార్య; ఆది = మొదలగు; హరిదిభేంద్ర = దిగ్గజముల {హరిదిభేంద్రము - హరిత్ (దిక్కు లందలి) ఇభ (గజము) ఇంద్రము (శ్రేష్ఠమైనది), దిగ్గజము}; దయితలు = భార్యలు; అందఱున్ = ఎల్ల; తన = తన; వెంటదగిలి = వెంటబడి; నడవన్ = రాగా; కుంభి = గజ; విభుడు = రాజు; ఒప్పెన్ = చక్కగా ఉండెను; ఒప్పులకుప్ప = అందాలరాశి; పోలెన్ = వలె;

భావము:

గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక లోకం లోని స్త్రీల స్తనాలు పైటకొంగుల మాటు కోరాయి. అతని నడకల ఠీవికి సరితూగలేక అతివల పాదాలు అందెల అండ తీసుకొన్నాయి. అతని తొండం సిరికి తూగలేక కన్నెల చిన్ని తొడలు ఒడ్డాణాల కాంతులను తోడు తెచ్చుకొన్నాయి. అతని దంతాల కాంతికి సరితూగలేనందుకే ఉవిదల చిరునవ్వులు ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకొన్నాయి. అతని లావణ్య స్వరూపాన్ని చూడగోరి అంజనావతి, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్లు ఆడ ఏనుగులు అనుసరిస్తుండగా ఒప్పులకుప్పలా ఆ గజరాజు ఒప్పి ఉన్నాడు. (చక్కటి స్వభావోక్తి అలంకారం ఆస్వాదించండి)
రహస్యార్థం -గజేంద్రుడు అను జీవుడు పంచకోశయుక్తుడై, సప్తధాతువులతోనూ, బహిరంతర ఇంద్రియాలతో, దశవిధ ప్రాణాలతోనూ, శబ్దాది విషయాలతోనూ, శరీర త్రయా న్వితుడై, అవిద్య అనే కన్యకతో పరిణయం కోసం అలంకృతుడైన పెళ్ళికొడుకులా కనబడుతున్నాడు.