పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని వర్ణన

  •  
  •  
  •  

8-39.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ
డాసి మూర్కొని దివికిఁ దొండంబు జాఁచు
వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు
త్తమాతంగ మల్లంబు హిమతోడ.

టీకా:

పల్వలంబుల = నీళ్లుగల చిన్నపల్లములలోని; లేత = లేత; పచ్చిక = పచ్చిగడ్డి పరకలను; చెలుల్ = ప్రియురాండ్ర; కున్ = కు; అందిచ్చున్ = అందించును; అచ్చికము = కొరత; లేక = లేకుండగ; ఇవురు = చిగుళ్ళ; జొంపములన్ = గుత్తులను; క్రొవ్వెలయు = అధికముగ పూసిన; పూ = పూవులతో నున్న; కొమ్మలన్ = కొమ్మలను; ప్రాణ = ప్రాణముతో సమానమైన; వల్లభల్ = భార్యల; కున్ = కు; పాలువెట్టు = పంచిపెట్టును; ఘన = అత్యధికముగ; దాన = మదజలముచే; శీతల = చల్లగా నున్న; కర్ణ = చెవు లనెడి; తాళంబులన్ = విసనకఱ్ఱలతో; దయితల = భార్యల; చెమటన్ = చెమటను; ఆర్చున్ = ఆరబెట్టును; తనువుల్ = దేహములను; అరసి = చూసి; మృదువుగా = మెల్లగా; కొమ్ములన్ = దంతములతో; మెల్లన = మృదువుగా; గళములున్ = మెడలను; నివురుచున్ = రాయుచు; ప్రేమ = ప్రీతి; తోన్ = తోటి; నెఱపు = సాగించును; వలపు = వలపులను.
పిఱుదు = పిఱ్ఱల; చక్కట్ల = భాగముల; డగ్గఱి = దగ్గరకు; ప్రేమ = ప్రీతి; తోడన్ = తోటి; డాసి = చేరి; మూర్కొని = వాసనచూసి; దివి = ఆకాశము; కిన్ = మీదికి; తొండంబున్ = తొండమును; చాచున్ = చాచును; వెద = పశుఋతుధర్మమును; వివేకించున్ = తరచిచూచును; క్రీడించున్ = విహరించును; విశ్రమించున్ = విశ్రాంతి తీసుకొనును; మత్త = మదించిన; మాతంగ = ఏనుగు; మల్లంబు = శ్రేష్ఠము; మహిమ = గొప్పదనముతోటి.

భావము:

అప్పుడా గజేంద్రుడు బల్లిదుడై తన ప్రియురాళ్ళకి నీటి గుంటల పక్కన ఉండే లేతపచ్చికలు మచ్చికతో అందిస్తోంది. చిగుళ్ళు పూలకొమ్మల గుత్తులు పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనకఱ్ఱల్లాంటి పెద్దపెద్ద చెవులతో వాటి చెమటలు ఆర బెడుతోంది. వాటి మెడలకింద మెల్లగా తన దంతాలతో గోకుతూ వలపుల ప్రేమ చూపుతుంది. వాటి వెనక్కి ప్రేమగా చేరి వాసన చూసి తొండాన్ని పైకెత్తి ఆకాశానికి చాచి ఋతు సమయాన్ని గుర్తిస్తోంది, క్రీడించి విశ్రమిస్తోంది.
రహస్యార్థం -బలిష్టమైన ఆ గజరాజు అను జీవుడు తన ప్రియురాలు అనగా మనస్సునకు సంతోషం కలిగించాలి అని, ఇంద్రియ విషయాలను నెరవేరుస్తూ, వృత్తులు అనే దంతాలతో అవిద్యను ఆనందింపజేస్తూ ఉన్నాడు.