పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని వర్ణన

  •  
  •  
  •  

8-38-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వెనుక ముందట నుభయ పార్శంబులఁ దృషార్థితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దన కరేణుసముదయంబును నొక్కతెరువై పోవుచు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వెనుక = వెనుకపక్క; ముందటన్ = ముందుపక్క; ఉభయ = రెండు; పార్శంబులన్ = పక్కలను; తృష = దప్పిక తీర్చుకొనుటను; అర్థితంబులు = కోరునవి; ఐ = అయ్యి; అరుగుదెంచు = కూడ వచ్చుచున్న; ఏనుగు = ఏనుగుల; గములన్ = గుంపులను; కానక = చూడలేక; తెఱంగు = దారి; తప్పి = తప్పిపోయి; తొలంగుడుపడి = ఎడబాసి; ఈశ్వరాయత్తంబు = దైవవశము; ఐన = అయిన; చిత్తంబున్ = మనసు; సంవిత్తంబున్ = తెలివి గలదిగా; కాకుండుట = లేకపోవుట; చేసి = వలన; తానున్ = తను; తన = తన యొక్క; కరేణు = ఆడు యేనుగుల; సముదయంబును = గుంపు; ఒక్క = వేరొక; తెరువు = దారిపట్టినవి; ఐ = అయ్యి; పోవుచు = వెళ్ళుచు.

భావము:

ఆ గజరాజు దైవవశం చేత బుద్ధి సరిగా పనిజేయక తనకు ఎటుపక్క కూడా దప్పికతో వచ్చే ఇతర ఏనుగుగుంపులు కనబడక విడిపోయి దారితప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో కాక వేరేదారి పట్టి పోసాగాడు.
రహస్యార్థం -జీవుడు స్వస్థానాన్ని తప్పి, అన్నమయాది కోశం అనే భౌతిక దేహంతో, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మున్నగు ఆవరణల ఉపాధులతో కూడి పరిభ్రమణ శీలుడు అయి...