పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-284-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం
ని భాషించెద; వైన నిందుఁ గలఁడే" యంచున్ మదోద్రేకియై
నుజేంద్రుం డరచేత వ్రేసెను మహోగ్ర ప్రభా శుంభమున్
దృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.

టీకా:

వినరా = వినుము; డింభక = పిల్లవాడా; మూఢ = మూర్ఖపు; చిత్త = బుద్ధిగలవాడ; గరిమన్ = గొప్పగ, గట్టిగ; విష్ణుండు = హరి; విశ్వాత్మకుండు = విశ్వమందంతటనుగలవాడు; అని = అని; భాషించెదవు = అనుచున్నావుకదా; ఐనన్ = అయినచో; ఇందున్ = దీనిలో; కలడే = ఉన్నాడా; అంచున్ = అనుచు; మద = మదముచేత; ఉద్రేకి = అతిశయముచెందినవాడు; ఐ = అయ్యి; దనుజ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; అరచేతన్ = అరచేతితో; వ్రేసెను = దెబ్బకొట్టెను; మహ = గొప్ప; ఉదగ్ర = పొడవైన, భయంకరమైన; ప్రభా = కాంతులచే; శుంభమున్ = ప్రకాశించుచున్నదానిని; జన = ప్రజల; దృక్ = చూపులకు; భీషణ = భయముగలుపు; దంభమున్ = డంబముగలదానిని; హరి = విష్ణుని (నరసింహుని); జనుస్ = ఆవిర్భావము యొక్క; సంరంభమున్ = ఆటోపముగలదానిని; స్తంభమున్ = స్తంభమును.

భావము:

“ఒరే! వినరా! మూర్ఖా! అర్భకా! ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్మకుడు అంటున్నావు. అయితే దీంట్లో ఉన్నాడా?” అంటూ మదోన్మత్తుడు అయి; ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో; జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి,భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి; ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.