పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-283-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి యొఱఁబెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరించుచు.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; కరాళించి = బొబ్బరిల్లి; గ్రద్దనన్ = చటుక్కున; లేచి = లేచి; గద్దియన్ = సింహాసనమును; డిగ్గనుఱికి = దిగదుమికి; ఒఱన్ = ఒరలో; పెట్టిన = పెట్టిన; ఖడ్గంబున్ = కత్తిని; పెఱికి = బయటకుతీసి, దూసి; కేలన్ = చేతిలో; అమర్చి = పట్టుకొని; జళిపించుచు = ఆడించుచు; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో; శిఖామణి = ఉత్తముడు; ఐన = అయిన; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; ధిక్కరించుచు = తిరస్కరించుచు.

భావము:

అలా అనే సరికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసాడు. చివాలున లేచి సింహాసనం మీంచి క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు.