పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-273-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాకుంర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు జేయుచు నిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; హరి = విష్ణు; కింకరుండు = దాసుడు; శంకింపక = జంకక; హర్ష = సంతోషమువలన; పులకాంకుర = గగుర్పాటు; సంకలిత = కలిగిన; విగ్రహుండు = రూపముగలవాడు; ఐ = అయ్యి; ఆగ్రహంబు = కోపము; లేక = లేకుండగ; హృదయమున = హృదయమందు; హరిన్ = విష్ణుని; తలంచి = స్మరించి; నమస్కరించి = నమస్కారముచేసి; బాల = చిన్నపిల్లవాని; వర్తనంబునన్ = నడవడికతో; నర్తనంబు = నాట్యము; చేయుచున్ = చేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేసాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.