పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-270-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చంపినఁ జచ్చెద ననుచును
గంపింపక యోరి! పలువ! ఠినోక్తుల నన్
గుంపించెదు చావునకుం
దెంరి యై వదరువాని తెఱఁగునఁ గుమతీ!

టీకా:

చంపినన్ = చంపితే; చచ్చెదను = చచ్చిపోతాను; అనుచునున్ = అని తలచుకొని; కంపింపక = బెదరక; ఓరి = ఓరి; పలువ = తులువా; కఠిన = గడుసు; ఉక్తులన్ = మాటలతో; నన్ = నన్ను; కుంపించెదు = బాధించెదవు, అతిక్రమించెదవు; చావు = మరణమున; కున్ = కు; తెంపరి = తెగించినవాడవు; ఐ = అయ్యి; వదరు = ప్రేలెడి; వానిన్ = వాని; తెఱగునన్ = విధముగ; కుమతి = చెడ్డబుద్ధిగలవాడా.

భావము:

“దుర్మతీ! చావుకు తెగించావు. చంపుతారని కానీ, చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా కర్ణకఠోరమైన మాటలనే ఈటెలను నా మీదకే విసురుతున్నావు. చావును కూడా లెక్కచేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు.