పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-266.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైరు లెవ్వరు చిత్తంబు వైరి గాఁక?
చిత్తమును నీకు వశముగాఁ జేయవయ్య!
దయుతాసురభావంబు మానవయ్య!
య్య! నీ మ్రోల మేలాడయ్య! జనులు.

టీకా:

కాల = కాలము నందు; రూపంబులన్ = రూపము లందు; క్రమ = పద్ధతు లందు; విశేషంబులన్ = ప్రత్యేకత లందు; అలఘు = గొప్ప; గుణ = గుణములకు; ఆశ్రయుండు = కారణము; అయిన = ఐన; విభుడు = ప్రభువు; సత్త్వ = పృథివ్యాది ద్రవ్యము {పృథివ్యాది - సత్త్వములు, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; బల = శక్తి; ఇంద్రియ = సాధనసంపత్తి; సహజ = నైజమైన; ప్రభావము = మహిమ; ఆత్ముడు = కలిగినవాడు; ఐ = అయ్యి; వినోదంబునన్ = క్రీడవలె; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వమును; కల్పించున్ = సృష్టించును; రక్షించును = కాపాడును; ఖండించున్ = నాశనము చేయును; అవ్యయుండు = నాశము లేనివాడు; అన్ని = సర్వ; రూపముల్ = రూపముల, బింబముల; అందున్ = లోను; అతడు = అతడు; కలడు = ఉన్నాడు; చిత్తంబున్ = మనసును; సమము = సమానముగా నున్నది; కాన్ = అగునట్లు; చేయుము = చేయుము; మార్గంబున్ = మంచి త్రోవను; తప్పి = తొలగి; వర్తించు = తిరిగెడు; చిత్తంబున్ = మనసు; కంటెన్ = కంటె.
వైరులు = శత్రువులు; ఎవ్వరు = ఎవ రుంటారు; చిత్తంబున్ = మనసు; వైరి = శత్రువు; కాక = కాకుండగ; చిత్తమును = మనసును; నీ = నీ; కున్ = కు; వశము = లొంగి యుండునది; కాన్ = అగునట్లు; చేయవు = చేయుము; అయ్య = తండ్రి; మద = గర్వముతో; యుత = కూడిన; అసుర = రాక్షస; భావంబున్ = తలపులను; మానవు = మునివేయుము; అయ్య = తండ్రి; అయ్య = తండ్రి; నీ = నీ; మ్రోలన్ = ఎదుట; మేలు = మంచి; ఆడరు = చెప్పరు; అయ్య = తండ్రి; జనులు = ప్రజలు.

భావము:

నాన్నగారూ! ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ ప్రభువు విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు నిధి. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్నిసృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు. అన్ని రూపాలలోనూ అతడు ఉంటాడు. తండ్రీ! మనస్సుకు సమదృష్టి అలవరచుకో. ధర్మమార్గం తప్పిన మనస్సు కంటె పరమ శత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని నువ్వే చిత్తానికి “చిత్తం, చిత్తం” అంటూ దాస్యం చేయకూడదు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పటం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పటం లేదు.