పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-259-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్.

టీకా:

కంఠ = గొంతు; క్షోభము = నొప్పిపెట్టినది; కాగన్ = అయ్యేలా; ఒత్తిలి = గట్టిగా; మహా = మిక్కిలి; గాఢంబుగా = తీవ్రముగా; డింభ = కుఱ్ఱవాడా; వైకుంఠున్ = విష్ణుని; చెప్పెదు = చెప్పెదవు; దుర్జయుండు = జయింపరానివాడు; అనుచున్ = అనుచు; వైకుంఠుండు = విష్ణువు {వైకుంఠుడు - కుంఠము (ఓటమి) లేనివాడు, విష్ణువు}; వీరవ్రత = యుద్ధము నందలి; ఉత్కంఠా = వేడుక; ఆబంధురుడు = దట్టముగా గలవాడు; ఏని = అయినచో; నేన్ = నేను; అమరులన్ = దేవతలను {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; ఖండింపన్ = నరకుచుండగా; దండింపగాన్ = శిక్షించుచుండగా; కుంఠీభూతుడు = వెనకకి తగ్గువాడు; కాక = కాకుండగ; రా = రా; వలదె = వద్దా; మత్ = నా యొక్క; ఘోర = భయంకరమైన; ఆహవ = యుద్ధ; క్షోణికిన్ = రంగమునకు.

భావము:

అర్భకా! వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలుకాదు అంటూ గొంతు చించుకుని గట్టిగా తెగ అరుస్తున్నావు కానీ, అతనికే పౌరుషం వీరత్వం ఉంటే, నేను యుద్ధరంగంలో దేవతలను ఖండించేటప్పుడూ, దండించేటప్పుడూ భయపడకుండా వాళ్ళను రక్షించడానికి, నా ముందుకు రావాలి కదా?