పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-249-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విత్తము సంసృతిపటలము
వ్రత్తము కామాదివైరిర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభ మగు మనకున్."

టీకా:

విత్తము = విదళించెదము; సంసృతి = సంసార; పటలమున్ = కూటమిని; వ్రత్తము = చీల్చెదము; కామాదివైరివర్గంబులన్ = అరిషడ్వర్గములను {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు యనెడి ఆరుశత్రువులకూటములు}; నేడు = ఇప్పుడు; ఇత్తము = అప్పజెప్పెదము; చిత్తము = మనస్సును; హరి = విష్ణుని; కిని = కి; చొత్తము = చేరుదము; నిర్వాణపదమును = పరమపదమును; శుభము = క్షేమము; అగున్ = కలుగును; మన = మన; కున్ = కు.

భావము:

ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం. అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం. చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం. కైవల్య పదాన్ని అందుకుందాం. మనకు తప్పక శుభం కలుగుతుంది."