పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-248-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుదము మనము హరిరతిఁ
బాడుద మే ప్రొద్దు విష్ణుద్రయశంబుల్
వీడుదము దనుజసంగతిఁ
గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్.

టీకా:

ఆడుదము = ఆడుకొనెదము; మనము = మనము; హరి = విష్ణుని యందలి {హరి - భక్తుల హృదయమును ఆకర్షించువాడు, విష్ణువు}; రతిన్ = ప్రీతిచేత; పాడుదము = పాడుదము; ఏ = అన్ని; ప్రొద్దున్ = వేళ నైనను; విష్ణు = హరి; భద్ర = మంగళకరములైన; యశంబుల్ = కీర్తులు; వీడుదము = వదలివేసెదము; దనుజ = రాక్షసులతోడి; సంగతిన్ = చెలిమిని, సాంగత్యమును; కూడుదము = కలిసెదము ; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ముక్తిని యిచ్చువాడు, విష్ణువు}; భక్తి = భక్తుల; కోటిన్ = సమూహమును; సూటిన్ = సూటిగా.

భావము:

మనం శ్రీహరి మీది చిత్తముతో ఆడుకుందాం రండి. మాధవుడిని మనసు నిండా నింపుకుని హరిసంకీర్తనలు పాడుకుందాం. మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం. నిర్భయంగా విష్ణుభక్తులతో చేరిపోదాం రండి.