పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-240.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులు కొని యుండుఁ; దనలోన మాటలాడు;
వేల్పు సోఁకిన పురుషుని వృత్తి దిరుగు;
బంధములఁ బాసి యజ్ఞానటలిఁ గాల్చి
విష్ణుఁ బ్రాపించుఁ; దుది భక్తి వివశుఁ డగుచు.

టీకా:

దనుజారి = నారాయణుని; లీలా = వేడకకొఱకైన; అవతారంబులు = అవతారముల; అందలి = లోని; శౌర్య = పరాక్రమపు; కర్మంబులు = చేతలు; సద్గుణములు = మంచిగుణములు; విని = విని; భక్తుడు = ప్రపన్నుడు; అగువాడు = అయ్యెడివాడు; వేడ్కన్ = కౌతుకము; తోన్ = తోటి; పులకించి = గగుర్పాటుచెంది; కన్నులన్ = కళ్ళనుండి; హర్ష = ఆనందపు; అశ్రు = కన్నీటి; కణములు = బిందువులు; ఒలుకన్ = జాలువారగా; గద్గద = డగ్గుతిక; స్వరము = గొంతు; తోన్ = తోటి; కమలాక్ష = హరి {కమలాక్షుడు - కమలములవంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; వైకుంఠ = హరి {వైకుంఠుడు - కుంఠము(ఓటమి) లేనివాడు, హరి}; వరద = హరి {వరద - వరములను యిచ్చువాడు, విష్ణువు}; నారాయణ = హరి {నారాయణ - శబ్దములకు ఆధారభూతుడైన వాడు, విష్ణువు (విద్యార్థి కల్పతరువు)}; వాసుదేవ = హరి {వాసుదేవ - ఆత్మలందు వసించు దేవుడు, విష్ణువు}; అనుచున్ = అనుచు; ఒత్తిలి = గట్టిగా; పాడున్ = పాడును; ఆడున్ = నాట్యము చేయును; ఆక్రోశించున్ = వాపోవును; నగున్ = నవ్వును; చింతనము = ధ్యానము; చేయును = చేయును; నతిన్ = మ్రొక్కుట; ఒనర్చున్ = చేయును.
మరులుకొని = మోహము చెంది; ఉండున్ = ఉండును; తనలోన = తనలోతనే; మాటలాడున్ = మాట్లాడుకొనును; వేల్పు = దయ్యము, పూనకము; సోకిన = పట్టిన, వచ్చిన; పురుషుని = మానవుని; వృత్తిన్ = విధముగ; తిరుగున్ = వర్తించును; బంధములన్ = సాంసారిక బంధనములను; పాసి = తొలగించుకొని; అజ్ఞాన = అవిద్యా; పటలిన్ = సమూహమును; కాల్చి = మసిచేసి; విష్ణున్ = విష్ణుమూర్తిని; ప్రాపించున్ = చెందును, లీనమగును; తుదిన్ = చివరకు; భక్తి = భక్తివలన; వివశుడు = మైమరచినవాడు; అగుచు = అయిపోతూ.

భావము:

భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైనవాడు పొంగిపోతాడు. సుగుణాలు విని పులకరించి పోతాడు. భక్తి పారవశ్యంతో కళ్ళలో ఆనందభాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠంతో “కమలాక్షా! వైకుంఠా! వరదా! నారాయణా! వాసుదేవా!” అని గొంతెత్తి పాడతాడు. ఆడతాడు. అరుస్తాడు. నవ్వుతాడు. ఇంకా నమస్కరిస్తాడు. ఎప్పుడు ఆ దేవుడిమీద మోహం కలిగి ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. అంతే కాదు దయ్యం పట్టినట్లు తిరుగుతాడు. ఇట్లు భక్తి తత్పరుడు అయి ఉండి, చివరకు కర్మబంధాలను విడిచి, అజ్ఞానం తొలగించుకుని, భక్తి వివశుడై, విష్ణువు నందు ఐక్యం అవుతాడు.